స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 320 తగ్గి 1,52,680 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 300తగ్గి రూ.1,39,950వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 100తగ్గి రూ. 2,74,900వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | May 08, 2026, 10:54 am IST
Read Time: 2 mins
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ ఆర్థిక, బౌగోళిక పరిణామాలు..ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ద ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలలో అస్థిరతను కొనసాగిస్తున్నాయి. శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 320 తగ్గి 1,52,680 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 300తగ్గి రూ.1,39,950వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 100తగ్గి రూ. 2,74,900వద్ద కొనసాగుతుంది. పెళ్లిళ్ల సీజన్ సాగుతుండటంతో తగ్గిన ధరలు బంగారం, వెండి కొనుగోలుకు కొంత సానుకూలంగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం స్వల్పకాలికంగా బంగారం ధరలు ఎక్కడైనా తగ్గితే, అది కొనుగోలుదారులకు ఒక మంచి అవకాశంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. ధరలు ఈ స్థాయికి పైన ఉన్నంత వరకు బుల్లిష్ నిర్మాణం చెక్కుచెదరకుండా ఉంటుందని, ఒకవేళ ధరలు తగ్గినా, ఈ మద్దతు స్థాయి వద్ద మళ్ళీ కొనుగోలుదారులు యాక్టివ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. మార్కెట్ ఈ స్థాయి పైన ఉన్నంత వరకు ధరలు మళ్ళీ పుంజుకుంటూనే ఉంటాయని అంచనా వేస్తున్నారు.