Credit Card Limit | క్రెడిట్ కార్డులు వాడే వారికి అప్పుడప్పుడు లిమిట్ పెంచుకునే ఆప్షన్స్ ఇస్తుంటాయి. అలాంటి సమయంలో చాలామంది కస్టమర్లలో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ చేసే లిమిట్ పెంచుకోవాలా? తిరస్కరించాలా? అనే సందిగ్ధంలో ఉండిపోతారు. క్రెడిట్ లిమిట్ పెరిగితే లాభమా? నష్టమా అని అనేక బేరీజులు వస్తుంటారు. మరి ఈ లిమిట్‌ను పెరిగితే మనపై ఎలాంటి ప్రభావం ఉంటుంది.. దీనిపై ఆర్థిక నిపుణులు ఏం చేబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
క్రెడిట్ లిమిట్ అంటే ఏంటి?
క్రెడిట్ కార్డుల ద్వారా కస్టమర్లు ఉపయోగించుకునేందుకు బ్యాంకులు ఇచ్చే గరిష్ట పరిమితిని క్రెడిట్ లిమిట్ అంటారు. మన ఆదాయం, క్రెడిట్ స్కోర్‌ను బట్టి బ్యాంకులు క్రెడిట్ లిమిట్‌ను నిర్ణయిస్తారు. సాధారణంగా నెలసరి ఆదాయానికి రెండు నుంచి మూడు రెట్ల వరకు లిమిట్‌ను నిర్ధారిస్తున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు రూ.50వేలు సంపాదిస్తుంటే.. అతనికి బ్యాంకులు రూ.లక్షల నుంచి లక్షన్నర వరకు లిమిట్‌ను ఇస్తాయి. అదే ఎక్కువ శాలరీ సంపాదించే వారికి 4 నుంచి 5 రెట్ల వరకు కూడా లిమిట్‌ను పెంచుతాయి. అదే కొత్తగా క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారికి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు లిమిట్ ఇస్తాయి.
క్రెడిట్ లిమిట్ పెంచుకుంటే వచ్చే లాభాలు
క్రెడిట్ స్కోర్ పెరుగుదల: మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవడంలో లిమిట్ పెంపు ప్రధాన పాత్ర పోషిస్తోంది. మీ క్రెడిట్ లిమిట్ పెరిగితే యుటిలైజేషన్ రేషియో (CUR) తగ్గుతుంది. దీని ద్వారా మీ స్కోర్ మెరుగుపడుతుంది. అదేలా అంటే.. ఉదాహరణకు మీ క్రెడిట్ లిమిట్ రూ.50 వేలు ఉందని అనుకుందాం.. మీ నెలవారీ ఖర్చు రూ.30 వేలు అయితే, యుటిలైజేషన్ రేషియో 60 శాతం ఉంటుంది. అదే మీ లిమిట్ రూ.లక్షకు పెరిగితే మీ సీయూఆర్ ఆటోమేటిగ్గా 30 శాతానికి తగ్గిపోతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్ పెరగడానికి దోహదపడుతుంది. హోమ్‌లోన్ లేదా పర్సనల్ లోన్‌కు దరఖాస్తు చేసుకున్నప్పుడు తక్కువ వడ్డీకే రుణాలను పొందవచ్చు.
ఖర్చు సౌలభ్యం: మీ క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉన్నప్పడు ఏవైనా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసినప్పుడు, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది.
రివార్డు పాయింట్లు: లిమిట్ పెరగడం వల్ల క్యాష్‌బ్యాక్, రివార్డు పాయింట్లు వంటి ప్రయోజనాలు కూడా అధికంగా ఉందే అవకాశం ఉంటుంది.
రుణదాతల నమ్మకం పెరుగుతుంది: ఎక్కువ లిమిట్‌ను బాధ్యతాయుతంగా వాడుకుని, రెగ్యులర్‌గా పేమెంట్లు చేస్తే మీపై బ్యాంకులకు నమ్మకం పెరుగుతుంది. తద్వారా అధిక మొత్తంలో రుణాలు పొందే అవకాశం లభిస్తుంది.
లిమిట్ పెంపుతో నష్టాలు
ఆర్థిక క్రమశిక్షణ తప్పొచ్చు: క్రెడిట్ కార్డు లిమిట్ పెరిగితే ఎంత ప్రయోజనం ఉంటుందో.. అంతే ప్రమాదం కూడా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ లిమిట్ పెరిగితే అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఖర్చు చేసేటప్పుడు వెనుకాడరు.. కానీ ఆ తర్వాత వాటిని చెల్లించేందుకు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సైబర్ మోసాలతో జాగ్రత్త: క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉంటే ర్డు మిస్‌యూజ్ అయినప్పుడు నష్టం కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది.
రుణ అర్హతపై ఎఫెక్ట్: క్రెడిట్ కార్డుల్లో ఎక్కువ క్రెడిట్ ఎక్స్‌పోజర్ ఉండటం వల్ల హోమ్‌లోన్, కార్ లోన్ వంటి రుణాల అర్హతపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఎప్పుడు అంగీకరించాలి
మీ ఆదాయం పెరిగి, 6 నుంచి 12 నెలలుగా బిల్లులు పూర్తిగా సమయానికి చెల్లిస్తుంటే, క్రెడిట్ వినియోగం 30 నుంచి 40 శాతం లోపే ఉంటే లిమిట్ పెంపునకు అంగీకరించవచ్చు. అయితే ఖర్చులపై మీకు నియంత్రణ లేకపోతే లిమిట్ పెంచుకోకపోవడమే బెటర్ అని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.
Read More:
Credit Score | మీ క్రెడిట్ స్కోర్ 800 కంటే ఎక్కువకు పెరగాలా? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు!
Credit Score | మీ క్రెడిట్ స్కోర్ 800 కంటే ఎక్కువకు పెరగాలా? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు!
