• Telugu News
  • /National

Credit Card Closure | కస్టమర్ దెబ్బకు దిగొచ్చిన బ్యాంక్.. రూ.3.21లక్షల పరిహారంతో సెటిల్‌మెంట్!

Credit Card Closure | క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడంలో బ్యాంక్ చేసిన నిర్లక్ష్యం ఓ కస్టమర్‌కు లాభాన్ని తెచ్చిపెట్టింది. కస్టమర్ ఇచ్చిన చిన్న కంప్లయింట్‌తో దిగొచ్చిన బ్యాంక్ .. చివరకు రూ.3.21 లక్షల పరిహారం చెల్లించి సెటిల్‌మెంట్ చేసుకోవాల్సి వచ్చింది.

Reported by: Chandram | జాతీయం | Apr 23, 2026, 6:47 pm IST
Read Time: 5 mins
Credit Card Closure | కస్టమర్ దెబ్బకు దిగొచ్చిన బ్యాంక్.. రూ.3.21లక్షల పరిహారంతో సెటిల్‌మెంట్!

Credit Card Closure | క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడంలో బ్యాంక్ చేసిన నిర్లక్ష్యం ఓ కస్టమర్‌కు లాభాన్ని తెచ్చిపెట్టింది. కస్టమర్ ఇచ్చిన చిన్న కంప్లయింట్‌తో దిగొచ్చిన బ్యాంక్ .. చివరకు రూ.3.21 లక్షల పరిహారం చెల్లించి సెటిల్‌మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ వ్యక్తికి కోటక్ మహీంద్రా బ్యాంకు నుంచి రెండు క్రెడిట్ కార్డులు ఉన్నాయి. గత ఏడాది మేలో అతని క్రెడిట్ కార్డు లిమిట్‌ను ఉన్నఫళంగా రూ.లక్ష నుంచి రూ.10వేలకు బ్యాంకు తగ్గించేసింది. లిమిట్ తగ్గించేయడంతో తన రెండు క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయాలని కస్టమర్ భావించాడు. వెంటనే బ్యాంక్‌కు మెయిల్ ద్వారా రిక్వెస్ట్ పెట్టాడు. కానీ బ్యాంక్ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

బ్యాంక్ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో పలుమార్లు రిమైండర్ మెయిల్స్ కూడా పంపించాడు. అయినప్పటికీ బ్యాంకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అలా దాదాపు ఏడాది గడిచిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో అకౌంట్‌ను పరిశీలించగా.. క్రెడిట్ కార్డు మెయింటెనెన్స్ వార్షిక చార్జిల కింద రూ.1180 కట్ చేసినట్లు కస్టమర్ గుర్తించాడు. దీనిపై బ్యాంక్‌ను స్పందించగా.. మీ కార్డులు ఇంకా క్లోజ్ కాలేదని సమాధానమిచ్చారు. బిల్లు కట్టాలని సూచించారు.

 

Got ₹3.21 lakh compensation from Kotak Mahindra Bank for not closing my credit card
by
u/ruhaannnn in
CreditCardsIndia


బ్యాంక్ నుంచి వచ్చిన సమాధానంతో అసంతృప్తి చెందిన సదరు కస్టమర్ చివరకు బ్యాంకింగ్ అంబుడ్స్‌మెంట్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పుడు బ్యాంక్ నోడల్ అధికారి కస్టమర్‌ను సంప్రదించాడు. ఈ మెయిల్ ద్వారా చేసే క్లోజర్ రిక్వెస్ట్‌లు అంగీకరించబోమని పేర్కొన్నారు. అయితే తాను రాతపూర్వకంగా కూడా బ్యాంకులో లెటర్ ఇచ్చానని కస్టమర్ స్పష్టం చేశాడు.

ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతుండగానే.. కస్టమర్ ఖాతాలో రూ.3,21,000 పరిహారం జమ అయినట్లు మెసేజ్ రావడం గుర్తించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడంలో ఆలస్యం జరిగితే రోజుకు రూ.500 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కేసులో రెండు కార్డులపై 321 రోజులు ఆలస్యమైంది. దీంతో రెండు కార్డులపై రోజుకు వెయ్యి రూపాయల చొప్పున మొత్తం రూ.3.21లక్షలు చెల్లించబడినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని సదరు కస్టమర్ రెడిట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా పంచుకున్నాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది. దీనిపై నెటిజస్లు స్పందిస్తూ.. సరైన మార్గంలో ఫిర్యాదు చేస్తే న్యాయం సాధ్యమేనని కామెంట్ చేస్తున్నారు.

Read More:

Credit Card Limit | క్రెడిట్ లిమిట్ పెంచుకుంటే లాభమా? నష్టమా? నిపుణుల సలహా ఏంటి?

Credit Score | మీ క్రెడిట్ స్కోర్ 800 కంటే ఎక్కువకు పెరగాలా? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు!