Mahesh Babu|పొడ‌వాటి జుట్టుతో యూర‌ప్‌లో సంద‌డి చేస్తున్న మ‌హేష్ బాబు.. ఇలా ఎప్పుడు చూడ‌లేదే..!

  • Publish Date - April 12, 2024 / 07:27 AM IST

Mahesh Babu|సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అటు వ‌ర్క్, ఇటు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని చాలా చ‌క్క‌గా బ్యాలెన్స్ చేస్తార‌నే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. అస‌లు మ‌హేష్‌కి మాత్ర‌మే ఇది అలా ఎలా సాధ్య‌మ‌వుతుంద‌ని ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతుంటారు. షెడ్యూల్ గ్యాప్‌లో ఫ్యామిలీ అంద‌రిని తీసుకొని విహార యాత్ర‌ల‌కి వెళ్లి ఎంజాయ్ చేసి వ‌స్తుంటారు మ‌హేష్ . చివ‌రిగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించిన మ‌హేష్ బాబు ఇప్పుడు రాజ‌మౌళ ద‌ర్శ‌క‌త్వంలో గ్లోబల్ అడ్వెంచరస్‌ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు చ‌క‌చ‌కా కొన‌సాగుతున్న‌ట్టు తెలుస్తుంది. ఉగాదికే ఈ మూవీ లాంచ్ అవుతుంద‌ని అంద‌రు అనుకున్నారు కాని అది జ‌ర‌గలేదు.

మ‌హేష్ కొద్ది రోజుల క్రితం త‌న ఫ్యామిలీతో యూర‌ప్ ట్రిప్‌కి వెళ్లాడు. ప్ర‌స్తుతం అక్క‌డే ఉన్నాడు. యూరప్ ట్రిప్ నుంచి కొన్ని ఫొటోలు షేర్ చేశారు. అయితే ఫ్యామిలీతో కాకుండా అక్కడి ప్రదేశాలను ఎక్కువగా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ ఇచ్చాడు. అయితే ఈ ఫొటోల‌లో మ‌హేష్ బాబు తన కూతురు సితారతో కలిసి దిగిన ఓ క్యూట్ ఫొటో ఒకటి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. కూతురితో స‌ర‌దాగా గ‌డుపుతున్న‌ట్టుగా ఈ పిక్‌ని చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది. ఇక ఈ పిక్‌లో మ‌రో స్పెషాలిటీ ఏంటంటే మ‌హేష్ పొడ‌వాటి జుట్టుతో క‌నిపిస్తున్నారు. లాంగ్ హెయిర్.. రాజ‌మౌళి సినిమా కోసమే పెంచుతున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

సూపర్ స్టార్ స్టిల్ మాత్రం ఇప్పుడు టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. మ‌హేష్ లుక్ చూశాక రాజ‌మౌళి మ‌నోడితో గ‌ట్టిగానే ఏదో ప్లాన్ చేశాడ‌ని అర్ధ‌మ‌వుతుంది. ఆఫ్రికన్‌ అడ్వెంచరస్‌ ప్రాజెక్ట్ కాబ‌ట్టి ఇందులో మ‌హేష్ లుక్ గ‌తంలో ఎప్పుడు లేనంత వెరైటీగా ఉంటుంద‌ని అంటున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్‌ నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.ఈ చిత్రంలో పాపులర్‌ హాలీవుడ్ యాక్టర్‌తోపాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న స్టార్‌ యాక్టర్లు కూడా భాగం కానున్నారు. ఇక ఈ మూవీ కోసం రామోజీఫిలిం సిటీలో ఏకంగా రూ.100 కోట్ల ఖర్చుతో భారీ సెట్‌ వేసినట్టు కూడా ప్ర‌చారం నడుస్తుంది. ఈ సినిమా కోసం మహేష్‌ని రెండేళ్ల‌పాటు రాజ‌మౌళి లాక్ చేస్తాడ‌ని టాక్.

Latest News