Danube River | మీకు తెలుసా.. ఆ నది 10 దేశాల గుండా ప్రవహిస్తుంది..!
Danube River | నదులు( Rivers ) ఎత్తైన కొండల్లో పుట్టి.. వేల కిలోమీటర్లు ప్రయాణించి.. చివరకు సముద్రాల్లో( Sea ) కలుస్తుంటాయి. ఈ నదుల జల సవ్వడి ప్రకృతి ప్రేమికులను( Nature Lovers ) ఎంతగానో ఆకర్షిస్తుంది. ఆ నదీ ప్రవాహాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఓ నది కూడా పది దేశాల గుండా ప్రవహిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తుంది. మరి ఆ నది పేరేంటో తెలుసా.. అదే ఐరోపా( Europe )లోని దనుబే నది( Danube River ).
Danube River | ఈ భూమ్మీద ఎన్నో నదులు( Rivers ) జీవధారలుగా ఉన్నాయి. నదులు ఎత్తైన కొండల్లో పుట్టి నిత్యం ప్రవహిస్తూ.. అటు తాగునీటి, ఇటు సాగునీటి కష్టాలను తీర్చుతుంటాయి. చివరకు ఆ నదీ ప్రవాహం సముద్రం( Sea )లో కలుస్తుంది. అయితే నదులన్నీ కూడా ఆయా జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల మధ్య ప్రవహిస్తుంటాయి. ఆ మాదిరిగానే ఓ నది పది దేశాల గుండా ప్రవహిస్తుంది. ఏకంగా పది దేశాల గుండా ప్రవహించే ఆ నది గురించి తెలుసుకోవాలంటే యూరప్( Europe ) వెళ్లాల్సిందే.
మధ్య ఐరోపాలోని దనుబే నది( Danube River ) స్థానికంగా అతి పెద్ద నది. దీని పొడవు 2850 కిలోమీటర్లు. దనుబే నది జర్మనీ( Germany ), ఆస్ట్రియా, స్లోవకియా, హంగేరి, క్రోషియా, సెర్బియా, బల్గేరియా, మోల్దొవా, ఉక్రెయిన్(Ukraine ), రోమానియా( Romania ) దేశాల గుండా ప్రవహిస్తూ.. జీవనదిగా ఉంది.
దనుబే నది జర్మనీలోని డోనౌస్చింగెన్ పట్టణం సమీపంలో ఉద్భవించి, ఆగ్నేయంగా ప్రవహిస్తుంది. జర్మనీ నుంచి ఆస్ట్రియా, స్లోవకియా, హంగేరి, క్రోషియా, సెర్బియా, బల్గేరియా, మోల్దొవా, ఉక్రెయిన్, రొమానియా మీదుగా ప్రవహించి చివరకు నల్ల సముద్రం( Black Sea )లో కలుస్తుంది. దనుబే నది ఐరోపాలో రెండవ పొడవైన నది, మధ్య ఐరోపాలో పొడవైనది.
యూరప్‌లో దనుబే నదికి ఎంతో ప్రత్యేకత ఉంది. జలమార్గాలలో దనుబే నది అత్యంత ముఖ్యమైనది కూడా. ప్రధాన యూరోపియన్ నగరాలు ఈ నది ఒడ్డునే ఉన్నాయి. దనుబే నది వాణిజ్యానికి కీలకమైన మార్గంగా మారింది. అంతేకాకుండా ఈ నదిపై పెద్ద జలవిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. మధ్య ఐరోపాకు విద్యుత్‌ను అందించడంతో ఈ విద్యుత్ కేంద్రాలు తోడ్పాటును అందిస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram