Pune Techie | 47 లక్షల జాబ్ రిజెక్ట్ చేసిన టెక్కీ.. అసలు కారణం తెలిస్తే షాకవుతారు!

Pune Techie | ఈరోజుల్లో మంచి జాబ్ దొరకడమే కష్టమంటే.. రూ.47 లక్షల ప్యాకేజీతో ఆఫర్ చేసిన ఉద్యోగాన్ని పుణెకి చెందిన ఓ టెక్కీ తిరస్కరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అతను తీసుకున్న నిర్ణయం వెనుక అసలు కారణం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

Pune Techie | ఈరోజుల్లో మంచి జాబ్ దొరకడమే కష్టమంటే.. రూ.47 లక్షల ప్యాకేజీతో ఆఫర్ చేసిన ఉద్యోగాన్ని ఓ టెక్కీ తిరస్కరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. టెక్కీ. పుణెకి చెందిన ఇంజినీరింగ్ మేనేజర్ వనేశ్ మాలికి సీనియర్ రోల్ కోసం ఎంపికైతే వద్దని నిర్మొహమాటంగా చెప్పేశాడు. అయితే అతను తీసుకున్న నిర్ణయం వెనుక అసలు కారణం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

తనకు రూ.47 లక్షల ప్యాకేజీతో వచ్చిన జాబ్‌ను తిరస్కరించానని మాలి సోషల్‌మీడియాలో తెలిపాడు. అంతేకాదు ఎందుకు ఆ జాబ్‌ను వద్దనుకున్నాడో కూడా వివరించాడు. ఆఫర్ చాలా బాగుంది. కంపెనీ కూడా అద్బుతం. కానీ ఆ రోల్‌కు అవసరమైన నైపుణ్యాలు పూర్తిగా నా దగ్గర లేవు. వారికి కావాల్సిన స్థాయిలో డెలివరీ చేయడానికి నేను ఇంకా సిద్ధంగా లేను అని మాలి తెలిపాడు. అందుకే ఆఫర్‌ను మర్యాదపూర్వకంగా తిరస్కరించానని పేర్కొన్నాడు.

మాలి పెట్టిన పోస్టు కాస్త ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో పలువురు తమ సందేహాలను వెలిబుచ్చారు. సరిపడా నైపుణ్యాలు లేకుండా ఇంటర్యూలో ఎలా ఎంపికయ్యారని పలువురు అడిగారు. అందుకు మాలి చెప్పిన సమాధానం కూడా ఆసక్తికరంగా ఉంది.ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు అన్ని బేసిక్‌ స్థాయిలోనే ఉన్నాయి. కానీ ఆ జాబ్ బాధ్యతలు, జీతం స్థాయిని బట్టి మరింత నైపుణ్యం అవసరం. అందుకే బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా. అని వివరించాడు. మొదట రిస్క్ తీసుకోవాలని అనిపించినప్పటికీ.. తర్వాత పూర్తిగా సిద్ధంగా లేనని భావించి వెనక్కి తగ్గినట్లు చెప్పాడు. ఇది కాస్త సోషల్‌మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.

మాలి చేసిన పోస్టులపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని వదులుకోవడం చాలా తప్పు. జాబ్‌లో చేరాక కూడా అవసరమై స్కిల్స్ నేర్చుకోవచ్చని సూచించారు. ఇది నిజాయితీకి నిదర్శనం. తాను సిద్ధంగా లేనని అంగీకరించడం గొప్ప విషయమని మరికొందరు అతనికి మద్దతుగా నిలిచారు. మొత్తానికి మాలి చేసిన పోస్టు ఇప్పుడు సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Latest News