Medaram | కొనసాగుతున్న మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులు

మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం పునర్నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పనులను ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం దేవాలయం పునర్నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

Medaram | కొనసాగుతున్న మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులు

విధాత, వరంగల్ :

మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం పునర్నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పనులను ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం దేవాలయం పునర్నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పని వివరాలను ఎన్ని రోజులలో పూర్తి చేస్తారని.. ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రాకార మండపం, గద్దెల ఆవరణలో జరుగుతున్న పనులన్నీ పూర్తి స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు పాటించి సకాలంలో పూర్తి చేయాలని ఆయన సూచించారు. మేడారం చేరుకున్న రాతి కట్టడాలకు సంబంధించిన రాళ్ళను కలెక్టర్ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఓ వీరస్వామి, ఐటీడీఏ ఏపిఓ వసంత రావు, ఆర్ అండ్ బీ, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.