విజయ్ వదులుకోబోయే స్థానం నుంచి త్రిష పోటీ చేస్తారా..?

అయితే టీవీకే అధినేత విజయ్ పోటి చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు. చెన్నైలోని పెరంబూర్, తిరుచిరాపల్లి తూర్పులో కూడా గెలవడంతో వీటిలో ఒక స్థానాన్ని వదులుకోక తప్పదు. అతను వదులుకున్న స్థానానికి మళ్లీ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో తాను వదులుకోబోయే స్థానంలో విజయ్ ఎవరిని నిలబెడతారన్న విషయం ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారింది.

విధాత:  తమిళనాడులో విజయ్‌ ‘ఈల’ మోత మోగించింది. అయితే డీఎంకే లేదంటే అన్నాడీఎంకే అనేలా యాభై ఏళ్లుగొ కొనసాగుతున్న సంప్రదాయాన్ని రెండేళ్ల వయసున్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీల్చి చెండాడింది. పొత్తులు లేకుండా, ప్రజాకర్షక పథకాలు ప్రకటించకుండా నిజాయతీతో పాలిస్తానన్న విజయ్‌ మాట నమ్మిన ప్రజానీకం అధికార డీఎంకేను, ప్రతిపక్ష అన్నాడీఎంకేను పక్కకు నెట్టేసి.. విజయ్‌ పార్టీ టీవీకేకు అద్భుతమైన మెజార్టీ కట్టబెడుతున్నట్లు తెలుస్తున్నది. ముక్కోణ పోటీలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అప్రతిహతంగా దూసుకుపోతున్నది.

 

అయితే టీవీకే అధినేత విజయ్ పోటి చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు. చెన్నైలోని పెరంబూర్, తిరుచిరాపల్లి తూర్పులో కూడా గెలవడంతో వీటిలో ఒక స్థానాన్ని వదులుకోక తప్పదు. అతను వదులుకున్న స్థానానికి మళ్లీ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో తాను వదులుకోబోయే స్థానంలో విజయ్ ఎవరిని నిలబెడతారన్న విషయం ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారింది.

గత కొంత కాలంగా త్రిష-విజయ్‌ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. త్రిష కారణంగానే విజయ్ భార్య అతన్ని వదులుకుందని అన్నారు. ఈ రోజు ఎన్నికల ఫలితాలతోపాటు, త్రిష పుట్టిన రోజు కూడా కావడంతో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. త్రిష పుట్టిన రోజు సందర్భంగా నటి వరలక్ష్మీ శరత్ కుమార్ షేర్ చేసిన స్టోరీ అందరినీ ఆకట్టుకుంటోంది. హ్యాపీ బర్త్ డే బేబీ.. బహుశా నీకు ఇది బెస్ట్ బర్త్‌డే. లవ్‌ యూ అంటూ ఆమె తన ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేశారు. అలాగే మంచు లక్ష్మీ కూడా ఎక్స్‌లో త్రిషకు విషెస్ చెప్తూ.. యూనివర్స్ బెస్ట్ గిఫ్ట్ ఇచ్చింది, ఎప్పుడూ అందంగా, హుందాగా ఉండే త్రిషకు బర్త్‌డే శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. అలాగే టీవీకే గెలుపును సెలబ్రేట్‌ చేసుకునేందుకు త్రిష కూడా విజయ్ ఇంటికి వెళ్లారు.

ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో త్రిష గతంలో తాను ఎప్పటికైనా సీఎం అవుతానంటూ మాట్లాడిన క్లిప్పులు తెగ వైరల్ అవుతున్నాయి. వీటన్నింటినీ ముడి పెడుతూ.. విజయ్ తాను వదులుకోబోయే స్థానం నుంచి త్రిషను నిలబెడతారనీ, తనకు ముఖ్యమైన పదవిని కట్టబెట్టే అవకాశాలు లేక పోలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. మరి విజయ్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

Latest News