Kerala | దారుణం.. దెయ్యం పట్టిందని మహిళను ఏం చేశారో తెలుసా?
టెక్కాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా భారత్ లో కొన్ని మూఢనమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి. 21 శతాబ్ధంలో భూమి నుంచి అంతరిక్షం వరకు ప్రయాణిస్తున్న కాలంలో కూడా ఇంకా మూఢనమ్మకాల అనవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి.
విధాత :
టెక్కాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా భారత్ లో కొన్ని మూఢనమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి. 21 శతాబ్ధంలో భూమి నుంచి అంతరిక్షం వరకు ప్రయాణిస్తున్న కాలంలో కూడా ఇంకా మూఢనమ్మకాల అనవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కేరళలో జరిగిన ఘటన మూఢనమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయనడానికి నిదర్శనంగా నిలిచింది. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను దెయ్యం పూనిందని చెప్పి చిత్రహింసలకు గురిచేసిన దారుణం కేరళలోని కొట్టాయం జిల్లాలో చోటుచేసుకుంది.
ఒక మహిళలకు దెయ్యం పట్టిందని ఆమె అత్తారింటి వాళ్లు ఓ మాంత్రికుడిని తమ ఇంటికి తీసుకొచ్చారు. దీనికి ఆ మహిళ భర్త కూడా సపోర్ట్ చేశాడు. దెయ్యం తొలగింపు పేరుతో మంత్రాలతో గంటల తరబడి మహిళను శారీరక, మానసిక హింసకు గురిచేశారు. అంతేకాకుండా ఆ మాంత్రికుడు మహిళకు బలవంతంగా మద్యం తాగించి, బీడీలు తాగిస్తూ నానా చిత్రహింసలు పెట్టారు. దీంతో ఆమె మానసిక పరిస్థితి మరింత దిగజారిపోయినట్లయింది.
దీనిపై బాధిత మహిళ స్పందిస్తూ.. దెయ్యాల పేరుతో ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు తనను చిత్రహింసలు పెడుతూ.. బలవంతంగా మద్యం, బీడీ తాగించారని వాపోయింది. చివరకు స్పృహ కోల్పోయాయని చెప్పారు. బాధిత మహిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి భర్తతో పాటు అత్తింటివారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram