demand for a husband । తనకు ఇలాంటి భర్త వస్తే చాలట.. ఓ మహిళ కండిషన్లు చూస్తే దిమ్మతిరగడం ఖాయం!

ఈమె షరతుల జాబితా, ఆమె కోరుకునే లైఫ్‌ స్టయిల్‌ (lifestyle) చూసిన నెటిజన్లు విస్తుబోతున్నారు. ఆమె పెట్టిన పోస్టుపై సామాజిక మాధ్యమాల్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

demand for a husband । తనకు ఇలాంటి భర్త వస్తే చాలట.. ఓ మహిళ కండిషన్లు చూస్తే దిమ్మతిరగడం ఖాయం!

demand for a husband । పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. తమకు అన్నీ నచ్చితేనే పెళ్లిళ్లు (marriage) చేసుకుంటారు. ఒకప్పుడంటే ఫలానా అమ్మాయితో నీకు పెళ్లి.. అంటే సరే నాన్నగారూ.. అంటూ అబ్బాయిలు (BOYS) ఒప్పుకొనేవారు. అమ్మాయిలు (GIRLS) అయితే చెప్పనక్కర్లేదు. కానీ.. రోజులు మారుతున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిల అభీష్టాలూ మారుతున్నాయి. ఒక్కోసారి అవి షరతులకూ (demands) దారి తీస్తున్నాయి. అలాంటి అబ్బాయి అయితేనే పెళ్లి చేసుకుంటానంటూ కొందరు అమ్మాయిలు తెగేసి చెప్పేస్తున్నారు. ఇలాంటి ఒక యువతి అసాధారణ డిమాండ్‌ (unusual demand) ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇది అబ్బాయిలకు పెళ్లిళ్లపై ఎంత ఒత్తిడి ఉందనే విషయంలో చర్చనూ లేవదీస్తున్నది.

ఆ యువతి షరతుల జాబితా చదివితే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మరో ఇంట్రెస్టింగ్‌ విషయం ఏమిటంటే.. ఆమె బీఈడీ డిగ్రీ కలిగి ఉన్నది. ఆమె వార్షికాదాయం లక్షా 30 వేలు. పైగా ఆమె డివోర్సీ. ఇంతకీ ఆమె షరతులు ఏంటంటే.. 30 లక్షల శాలరీ, 3బీహెచ్‌కే (3 BHK house) ఇల్లు ఉండాలట. అంతేకాదండోయ్‌.. అత్తమామలు ఉండకూడదనేది మరో కీలక షరతు. ఇక్కడితో ఆమె కండిషన్లు అయిపోలేదు. తనను చేసుకునేవాడు ఎంబీఏ లేదా ఎంఎస్‌ చది ఉండాలట. అమెరికాలోనో ఏ యూరప్‌ దేశంలోనో  సెటిలయి ఉంటే మరీ మంచిదట. ఎన్నారైలకు (NRIs) సంబంధించి.. కనీసంగా ఏడాదికి 80 లక్షలు సంపాదించేవాడయి ఉండాలట. ఇంకా ఆమె షరతుల జాబితాలో మరికొన్ని ఆసక్తికరమైనవీ ఉన్నాయి. తన జీవిత భాగస్వామి తనను తరచూ జాలీ ట్రిప్పులకు (travel trips) తీసుకెళ్లాలట. పైగా ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌లోనే తనను ఉంచాలట. తన తల్లిదండ్రులు సైతం తనతోనే ఉంటారని మరో కండిషన్‌. తన పని ఒత్తిడి కారణంగా ఇంటి పనులు చూసుకోలేనని, అందుకోసం ఒక వంట మనిషి, ఒక పనిమనిషి కావాలని పేర్కొన్నది.

ఈమె షరతుల జాబితా, ఆమె కోరుకునే లైఫ్‌ స్టయిల్‌ (lifestyle) చూసిన నెటిజన్లు విస్తుబోతున్నారు. ఆమె పెట్టిన పోస్టుపై సామాజిక మాధ్యమాల్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ‘విడాకులు తీసుకున్నావిడకు  అప్పటి వరకూ పెళ్లికాని మొగుడు కావాలా? భర్త తల్లిదండ్రులు ఇంట్లో ఉండకూడదు కానీ.. ఆమె తల్లిదండ్రులు మాత్రం ఉంటారా? ఆమె నెల సంపాదన 11వేలు అంటే.. నగరాల్లో ఇంటి పనిమనుషులకు సైతం దాదాపు అంతే ఉంటుంది. కానీ.. తనను భర్త గొప్పగా చూసుకోవాలని కోరుకుంటున్నది..’ అని ఒక యూజర్‌ రాశారు. ఆమె కోరికల వల్లే ఆమె విడాకులు తీసుకోవాల్సి వచ్చిందేమో.. ఆమె డిమాండ్లు చూస్తుంటే  బాగా డబ్బులున్న ఓ బానిస కోసం చూస్తున్నట్టుంది.. అని మరొకరు వ్యాఖ్యానించారు.