Scrub typhus | ఒడిస్సాను వణికిస్తున్న స్క్రబ్‌ టైఫస్‌.. మరో 11కేసుల గుర్తింపు

Scrub typhus విధాత : కేరళా రాష్ట్రాన్ని నిఫా వైరస్‌ భయపెడుతుంటే ఒడిస్సా రాష్ట్ర వాసులను స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి వణికిస్తుంది. ఒడిస్సాలో ఇప్పటిదాకా స్క్రమ్‌ టైఫస్‌ వ్యాధి బారిన పడి ఏడుగురు చనిపోయారు. అప్రమత్తమైన ఒడిస్సా ప్రభుత్వం వ్యాధి అధ్యయానానికి నిపుణల బృందాన్ని రంగంలోకి దించింది. ఒడిస్సా సుందర్‌గడ్‌ జిల్లాలో కొత్తగా 11స్క్రబ్‌ టైఫస్‌ పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న 59మంది శాంపిళ్లను పరీక్షించగా అందులో 11మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఈ […]

  • Publish Date - September 17, 2023 / 11:35 AM IST

Scrub typhus

విధాత : కేరళా రాష్ట్రాన్ని నిఫా వైరస్‌ భయపెడుతుంటే ఒడిస్సా రాష్ట్ర వాసులను స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి వణికిస్తుంది. ఒడిస్సాలో ఇప్పటిదాకా స్క్రమ్‌ టైఫస్‌ వ్యాధి బారిన పడి ఏడుగురు చనిపోయారు. అప్రమత్తమైన ఒడిస్సా ప్రభుత్వం వ్యాధి అధ్యయానానికి నిపుణల బృందాన్ని రంగంలోకి దించింది. ఒడిస్సా సుందర్‌గడ్‌ జిల్లాలో కొత్తగా 11స్క్రబ్‌ టైఫస్‌ పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న 59మంది శాంపిళ్లను పరీక్షించగా అందులో 11మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది.

ఈ వ్యాధి కేసుల సంఖ్య ఇప్పటికే 180కి చేరిందని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి ఒక రకమైన లార్వా పురుగులు కుట్టడంతో శరీరంపై ఎస్చర్‌ మచ్చ పడుతుందని, ఈ కీటకాలు కుట్టిన చోట చర్మకణాలు మృతి చెందుతాయని, ఎవరికైనా నాలుగైదు రోజులు జ్వరంగా ఉండే వారు వెంటనే పరీక్షలు చేసుకోవాలని సుందర్‌గడ్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కన్హు చరణ్‌ నాయక్‌ తెలిపారు. వ్యాధి నియంత్రణకు ఆశా కార్యకర్తలు, నర్సులకు తగిన శిక్షణ అందిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు.