ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గవర్నెన్స్ లో దేశంలో ఒక అడుగు ముందుకు వేసింది. జనవరి 15వ తేదీ నుంచి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఫైళ్లు ఇక ఈ ఫైళ్ల రూపంలోనే ఉంటాయని, ఐటీ అండ్ కమ్యూనికేషన్ల కార్యదర్శి కాటమనేని భాస్కర్ వెల్లడించారు. రాష్ట్రంలో పేపర్ ద్వారా నడిచే ఫైళ్లను తగ్గించాలని, అన్నింటిని ఆన్ లైన్ లో చూసుకునే విధంగాఈ ఆఫీసు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆయన కోరారు. జనవరి 15వ తేదీ నుంచి మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలు డెలివరీ చేయాలని, ఇప్పటికే ఈ సేవ ద్వారా కోట్లాది మంది సేవలు పొందుతున్నారన్నారు. కులం, ఆదాయం, నివాసం వంటి సర్టిఫికేట్ల కోసం, కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు చెల్లించేందుకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మనమిత్ర ద్వారా పొందుతున్నారని, ఈజీ గా బిల్లులు చెల్లిస్తున్నారన్నారు. మనమిత్ర పై పౌరులకు మరింత అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్లు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని, ప్రభుత్వ విభాగాల సేవలు మరింతగా పెరిగేలా అన్ని విభాగాలను సమన్వయం చేయాలన్నారు. మనమిత్ర ద్వారా జారీ అయ్యే సర్టిఫికేట్లకు ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ ని వినియోగిస్తున్నమని ఆయన వివరించారు. ఏమీ మీ సేవ, మీ సేవా కేంద్రాల ద్వారా జారీ అయ్యే వాటిని కూడా బ్లాక్ చైన్ కు అనుసంధానం చేశామని డీజీవెరిఫై లో కూడా ఉంటాయన్నారు. ప్రభుత్వ విభాగాల అధికారులు సంక్షేమ పథకాల అమలు కోసం ప్రతిసారి సర్టిఫికేట్ అడగకుండా ఉండేందుకు డిజిటైజేషన్ చేశామని, డిజీవెరిఫై ద్వారా నిర్థారించుకోవచ్చన్నారు. ఏపీపీఎస్సీ, ప్రభుత్వ నియామక సంస్థలకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని భాస్కర్ వెల్లడించారు.
పీపీపీ పై వెనక్కి తగ్గేది లేదు
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో 10 మెడికల్ కళాశాలలను కొనసాగిస్తామని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు జడిసి వెనక్కి తగ్గేది లేదని ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో స్పష్టం చేశారు. ఈ విధానంలో సేవలు బాగా అందుతాయని, ప్రైవేటీకరణ కాదని ఆయన వివరించారు. 70 శాతం సేవలు ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ కింద అందుతాయని, మెడికల్ సీట్లు కూడా పెరుగుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధానంలో వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నదన్నారు.
ఇవి కూడా చదవండి :
VB-G RAM-G Bill : ‘వీబీ జీ రామ్ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Dacoit Teaser | ఆసక్తి రేపుతున్న డెకాయిట్ టీజర్.. డాక్టర్ కాదు దొంగనా?
