Viral Story | ఫైటింగ్‌కేమో 3 గంటలు.. చదువుకేమో 15 నిమిషాలు.. ఆరేండ్ల బాలుడి దినచర్య ఇది..!
Viral Story | ఏ విద్యార్థి అయినా తన జీవితంలో బాగుపడాలంటే.. కచ్చితంగా దినచర్య పాటించాల్సిందే. ఇక ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటలకు సమయం కేటాయించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఆ ప్రకారం ఒక దినచర్యను సిద్ధం చేసుకుంటారు. రెగ్యులర్‌గా ఆ దినచర్యను ఫాలో అవుతుంటారు. అయితే ఓ ఆరేండ్ల బాలుడి దినచర్య మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే.. అతని దినచర్యలో అధిక సమయం ఫైటింగ్‌కే కేటాయించాడు. ఆ బాలుడి టైం టేబుల్‌ను పరిశీలిస్తే నవ్వుకోక […]

Viral Story | ఏ విద్యార్థి అయినా తన జీవితంలో బాగుపడాలంటే.. కచ్చితంగా దినచర్య పాటించాల్సిందే. ఇక ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటలకు సమయం కేటాయించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఆ ప్రకారం ఒక దినచర్యను సిద్ధం చేసుకుంటారు. రెగ్యులర్‌గా ఆ దినచర్యను ఫాలో అవుతుంటారు. అయితే ఓ ఆరేండ్ల బాలుడి దినచర్య మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే.. అతని దినచర్యలో అధిక సమయం ఫైటింగ్‌కే కేటాయించాడు.
ఆ బాలుడి టైం టేబుల్‌ను పరిశీలిస్తే నవ్వుకోక తప్పదు. చదువుకు 15 నిమిషాలు కేటాయిస్తే.. ఫైటింగ్‌కు ఏకంగా 3 గంటల సమయం కేటాయించాడు. ఇక నిద్రకు 12 గంటల సమయం కేటాయించాడు. ఉదయం 9 గంటలకు బెడ్ మీద నుంచి లేస్తే.. సరిగ్గా రాత్రి అదే సమయానికి నిద్రించేలా దినచర్య సిద్ధం చేసుకున్నాడు.
9 నుంచి 9:30 వరకు కాలకృత్యాలు, 9:30 నుంచి 10 గంటల వరకు బ్రేక్ ఫాస్ట్‌కు కేటాయించాడు. ఒక గంట పాటు టీవీ చూసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఇక చదువుకు మధ్యాహ్నం 2:30 నుంచి 2:45 గంటల వరకు అంటే కేవలం 15 నిమిషాలు మాత్రమే కేటాయించుకున్నాడు.
స్నానానికి అర గంట సమయం, మధ్యాహ్నం 3: 15 నుంచి సాయంత్రం 5 గంటలకు నిద్రించాలని టైం టేబుల్‌లో రాసుకున్నాడు. సాయంత్రం 5:15 నుంచి రాత్రి 7 గంటల వరకు కారుతో ఆడుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. రాత్రి 8 నుంచి 8:30 గంటల వరకు మామిడి పండ్లు తినేందుకు సమయం కేటాయించాడు. ప్రస్తుతం ఈ బాలుడి దినచర్య సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
My 6 year old cousin made this timetable…Bas 15 minutes ka study time, zindgi tu Mohid jee ra hai