Goat | మేకలను సాధారణంగా వేలల్లో విక్రయిస్తారు. కానీ ఈ మేక ధర మాత్రం లక్షల్లో పలికింది. 300 కిలోల బరువున్న ఈ మేక ఏకంగా రూ. 6 లక్షలకు అమ్ముడుపోయింది. వివరాల్లోకి వెళ్తే.. బక్రీద్ పర్వదినం సందర్భంగా లక్నోలోని బక్రా మండిలో పెద్ద ఎత్తున మేకల కొనుగోళ్లు జరిగాయి. అయితే 300 కిలోల బరువున్న మేక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ మేకకు షారూక్ అని యజమాని నామకరణం చేశాడు. అజ్మిరీ జాతికి చెందిన ఈ […]
Goat | మేకలను సాధారణంగా వేలల్లో విక్రయిస్తారు. కానీ ఈ మేక ధర మాత్రం లక్షల్లో పలికింది. 300 కిలోల బరువున్న ఈ మేక ఏకంగా రూ. 6 లక్షలకు అమ్ముడుపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. బక్రీద్ పర్వదినం సందర్భంగా లక్నోలోని బక్రా మండిలో పెద్ద ఎత్తున మేకల కొనుగోళ్లు జరిగాయి. అయితే 300 కిలోల బరువున్న మేక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ మేకకు షారూక్ అని యజమాని నామకరణం చేశాడు. అజ్మిరీ జాతికి చెందిన ఈ మేకను ఓ వ్యాపారవేత్త రూ. 6 లక్షలకు కొనుగోలు చేశాడు. షారుక్ అనే పేరుతో ఉన్న మరో మేకను కూడా రూ. 2.15 లక్షలకు కొనుగోలు చేశాడు.
ఈ సందర్భంగా షారుక్ యజమాని ఇర్ఫాన్ ఆగా మాట్లాడుతూ.. తన వద్ద పఠాన్, సుల్తాన్, రాజ్‌కుమార్ అనే పేర్లతో మేకలు ఉన్నాయని తెలిపారు. వాటిని కూడా ప్రత్యేకంగా పెంచుతున్నానని తెలిపాడు. తన మేకలకు బాలీవుడ్ యాక్టర్ షారుక్ పేరు పెట్టడం వల్ల ప్రత్యేక దృష్టిని ఆకర్షించగలిగానని ఇర్ఫాన్ పేర్కొన్నాడు.