మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాసిక్ - పుణె జాతీయ రహదారిపై కారు - కార్గో ట్రక్కు ఢీకొన్నాయి.

ముంబై : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాసిక్ – పుణె జాతీయ రహదారిపై కారు – కార్గో ట్రక్కు ఢీకొన్నాయి.మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాసిక్ – పుణె జాతీయ రహదారిపై కారు – కార్గో ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కును కారు ఓవర్ టేక్ చేయబోయే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులను ఓజస్వి ధన్‌కర్(2), ఆశా సునీల్ ధన్‌కర్(42), సునీల్ ధన్‌కర్(65), అభయ్ సురేశ్ విశాల్(48)గా గుర్తించారు. అస్మిత అభయ్ విశాల్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. వీరంతా అకోలే తాలుకాకు చెందిన వారని తెలిపారు.
ఈ ప్రమాదం కారణంగా నాసిక్ -పుణె జాతీయ రహదారిపై కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రక్కులో తీసుకెళ్తున్న ఐరన్ పైపులు రోడ్డు మీద పడిపోయాయి. వాటిని రోడ్డుపై నుంచి తొలగించేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు.