మునుగోడు బరిలో 47 మంది.. గెలిచేది ఎవరో..?

విధాత: మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈ ఎన్నిక బరిలో మొత్తం 47 మంది నిలిచారు. మొత్తం 130 మంది 190 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలనలో.. 47 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇక 83 మంది అభ్యర్థుల నామినేషన్లు ఓకే అయ్యాయి. ఇందులో 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తంగా ఉప ఎన్నిక బరిలో 47 మంది ఉన్నట్లు ఎన్నికల […]

  • By: krs    latest    Oct 17, 2022 11:24 AM IST
మునుగోడు బరిలో 47 మంది.. గెలిచేది ఎవరో..?

విధాత: మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈ ఎన్నిక బరిలో మొత్తం 47 మంది నిలిచారు. మొత్తం 130 మంది 190 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్ల పరిశీలనలో.. 47 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇక 83 మంది అభ్యర్థుల నామినేషన్లు ఓకే అయ్యాయి. ఇందులో 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

మొత్తంగా ఉప ఎన్నిక బరిలో 47 మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ 47 మందిలో గెలిచి నిలిచేది ఎవరో వేచి చూడాల్సిందే. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి, 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం వెల్లడించనున్నారు.

అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతో మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచిన 13 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నిన్న పది మంది, ఇవాళ ముగ్గురు నామినేషన్లను ఉప సంహరించుకుని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు.

టీఆర్ఎస్‌కు జై కొట్టిన ఇండిపెండెంట్ అభ్యర్దులు

నామినేషన్ల ఉపసంహరణకు ఈ రోజు చివరిరోజు మంత్రి జగదీశ్‌ రెడ్డి చొరవతో ఇండిపెండెంట్ అభ్యర్దులు మర్రిగుడెం మండలం రాంరెడ్డి పల్లికి చెందిన పల్లేటి జంగయ్య, అంతంపేటకు చెందిన సుధాకర్ నాయక్ నామినిషన్ ఉపసంహరించుకుని టీఆర్ఎస్‌కు జై కొట్టారు.

మర్రిగూడెం ఎంపీపీ మోహన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి జగదీష్ రెడ్డి , ఎమ్మెల్సీ రవీందర్ రావ్ లు వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.