దేవుడు బలివ్వమన్నాడని.. 6 ఏండ్ల బాలుడిని చంపేశారు
విధాత: ఇది క్రూరమైన చర్య.. గంజాయి మత్తులో ఓ ఇద్దరు వ్యక్తులు.. ఆరేండ్ల బాలుడిని హతమార్చారు. సాక్షాత్తు ఆ శివుడు ఓ బిడ్డను బలివ్వమని తమను కోరాడని ఆ ఇద్దరు వ్యక్తులు తెలిపారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని లోధి రోడ్డు ఏరియాలో నిన్న రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ఇద్దరు దంపతులు లోధి రోడ్డులోని ఓ నిర్మాణరంగ సంస్థలో కూలీలుగా పని చేస్తు అక్కడే తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నారు. అయితే […]

విధాత: ఇది క్రూరమైన చర్య.. గంజాయి మత్తులో ఓ ఇద్దరు వ్యక్తులు.. ఆరేండ్ల బాలుడిని హతమార్చారు. సాక్షాత్తు ఆ శివుడు ఓ బిడ్డను బలివ్వమని తమను కోరాడని ఆ ఇద్దరు వ్యక్తులు తెలిపారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని లోధి రోడ్డు ఏరియాలో నిన్న రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ ఇద్దరు దంపతులు లోధి రోడ్డులోని ఓ నిర్మాణరంగ సంస్థలో కూలీలుగా పని చేస్తు అక్కడే తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నారు. అయితే నిన్న రాత్రి డిన్నర్ ముగిసిన తర్వాత వారు భజనలు చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఇద్దరు వ్యక్తులు గంజాయి సేవించి, ఆ భజనల వద్దకు వచ్చి ఆరేండ్ల బాలుడిని అపహరించారు.
బాలుడు కనిపించక పోయేసరికి తండ్రి అప్రమత్తమై వారు పని చేస్తున్న సైట్ అంతా వెతికినా ఆ బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో సమీపంలో ఉన్న ఓ మురికివాడకు వెళ్లగా అక్కడ బాలుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అబ్బాయిని చంపిన వ్యక్తులిద్దరూ కూడా అక్కడే ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఆ ఇద్దరు గంజాయి సేవించి, ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే సాక్షాత్తు ఆ శివుడు ఓ బిడ్డను బలివ్వమని తమను కోరాడని ఆ ఇద్దరు వ్యక్తులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని సీజ్ చేశారు.