Heart Attack | విమానం గాల్లో ఉండగా రెండేళ్ల బాలుడికి తీవ్ర గుండెపోటు… తర్వాత జరిగింది ఇదీ..!
Heart Attack | విధాత: గుండెపోటు వస్తే నిమిషాల్లోనే ప్రాణాలు పోతున్న రోజులివి. అదే గాల్లో ప్రయాణిస్తూ అంబులెన్సులు, ఆసుపత్రుల సౌకర్యం లేని సమయంలో దాని బారిన పడితే ప్రాణాలు వదిలేసు కోవాల్సిందే. అయితే కొన్ని సార్లు అద్భుతాలు జరిగి కొంతమంది తృటిలో మృత్యువు నుంచి తప్పించుకుంటారు. ఓ రెండేళ్ల బాలుడి విషయంలో ఈ అద్భుతం జరిగింది. ఎయిమ్స్ ఈ ఘటనను ఎక్స్‌లో పంచుకుంది. ఆగస్టు 27న బెంగళూరు నుంచి దిల్లీ వెళుతున్న విస్తారా విమానం (Vistara […]

Heart Attack |
విధాత: గుండెపోటు వస్తే నిమిషాల్లోనే ప్రాణాలు పోతున్న రోజులివి. అదే గాల్లో ప్రయాణిస్తూ అంబులెన్సులు, ఆసుపత్రుల సౌకర్యం లేని సమయంలో దాని బారిన పడితే ప్రాణాలు వదిలేసు కోవాల్సిందే. అయితే కొన్ని సార్లు అద్భుతాలు జరిగి కొంతమంది తృటిలో మృత్యువు నుంచి తప్పించుకుంటారు. ఓ రెండేళ్ల బాలుడి విషయంలో ఈ అద్భుతం జరిగింది. ఎయిమ్స్ ఈ ఘటనను ఎక్స్‌లో పంచుకుంది. ఆగస్టు 27న బెంగళూరు నుంచి దిల్లీ వెళుతున్న విస్తారా విమానం (Vistara Plane) లో ఓ రెండేళ్ల బాలుడికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది.
దీంతో విమానంలో ఎవరైనా వైద్యులు ఉంటే.. బాధితునికి చికిత్స అందించాలని పైలట్ విజ్ఞప్తి చేశారు. ఒక సదస్సులో పాల్గొని దిల్లీ వెళుతున్న అయిదుగురు వైద్యుల బృందం ప్రయాణికుల్లో ఉండటంతో వారు వెంటనే బాలుడి దగ్గరకు వెళ్లి పరీక్షించారు. అప్పటికే అతడికి పల్స్ పడిపోయి శరీరం అంతా చల్లబడిపోయింది. అంతేకాకుండా పెదాలు, వేళ్లు బిగుసుకుపోతుండటంతో ఇక మృత్యువు తప్పదని అర్థమైంది.
అయినా తమ వంతు ప్రయత్నం చేద్దామని ఉన్న వనరులతోనే అప్పటికప్పుడు సీపీఆర్ ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో తక్కువ సమయంలోనే చిన్న ఆపరేషన్ చేసి గుండె దగ్గర ఐవీ కాన్యులాను అమర్చారు. దీంతో బాలుడిలో మళ్లీ రక్త సరఫరా ప్రారంభమైంది అని ఎయిమ్స్ తన పోస్ట్‌లో వివరించింది. అయితే ఆపరేషన్ చేసే సమయంలోనే మరోసారి కార్డియాక్ అరెస్టు సంభవించడంతో వారు మరింత కష్టపడాల్సి వచ్చిందని పేర్కొంది.
ఈ లోపే విమానాన్ని నాగ్‌పుర్‌కు మళ్లించడంతో అక్కడ బాలుడిని హుటాహుటిన అంబులెన్సులో తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ ఆ ఐదుగురు వైద్యులను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆ వైద్యులు డా.నవదీప్ కౌర్, డా.దామన్‌దీప్ కౌర్, డా.రిషభ్ జైన్, డా.ఓయ్‌షికా, డా.అవిచలా టాక్సస్ అని ఎయిమ్స్ ప్రకటించింది.