Cow Milk | ఆ ఆవు రోజుకు 65 లీటర్ల పాలు ఇస్తోందట..!
Cow Milk | ఆవులు పొద్దున, సాయంత్రం కలిపి రోజుకు ఐదారు లీటర్ల పాలు ఇస్తుంటాయి. కానీ ఈ ఆవు మాత్రం రోజుకు మూడు పూటలా 65 లీటర్ల పాలు ఇస్తోందట. ఉత్తరప్రదేశ్( Cow Milk )లోని ముజఫర్ నగర్‌లో నిర్వహించిన జాతీయ జంతు ప్రదర్శన( National Animal Exhibition ) లో ఈ ఆవు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏప్రిల్ 6, 7 తేదీల్లో నిర్వహించిన ఈ ప్రదర్శనలో దేశ వ్యాప్తంగా ఉన్న ఆవులు, బర్రెలు, […]

Cow Milk | ఆవులు పొద్దున, సాయంత్రం కలిపి రోజుకు ఐదారు లీటర్ల పాలు ఇస్తుంటాయి. కానీ ఈ ఆవు మాత్రం రోజుకు మూడు పూటలా 65 లీటర్ల పాలు ఇస్తోందట. ఉత్తరప్రదేశ్( Cow Milk )లోని ముజఫర్ నగర్‌లో నిర్వహించిన జాతీయ జంతు ప్రదర్శన( National Animal Exhibition ) లో ఈ ఆవు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఏప్రిల్ 6, 7 తేదీల్లో నిర్వహించిన ఈ ప్రదర్శనలో దేశ వ్యాప్తంగా ఉన్న ఆవులు, బర్రెలు, గుర్రాలు.. ఇతర జంతువులు పాల్గొన్నాయి. ఈ జంతువులన్నింటికి 18 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జంతువులకు మొదటి బహుమతి కింద రూ. 5 లక్షలు, రెండో బహుమతి కింద రూ. 2 లక్షలు, మూడో బహుమతి కింద రూ. 1 లక్ష అందజేశారు. మొత్తంగా ఆయా విభాగాల్లో బహుమతులు పొందిన జంతువులకు రూ. 50 లక్షల దాకా నగదు బహుమతులను అందజేశారు నిర్వాహకులు.
అయితే 65 లీటర్ల పాలిచ్చే హైబ్రిడ్ ఆవు ప్రదర్శన అంతటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆవు ఖరీదు రూ. 5 లక్షలు ఉంటుందని దాని యజమాని తెలిపాడు. మూడు పూటలా పాలిచ్చే ఆవును రైతులు ఆసక్తిగా గమనించారు. ఆ ఆవుతో పలువురు యువ రైతులు సెల్ఫీలు దిగారు. ఇక జంతు ప్రదర్శనలో మొత్తం 1200 పశువులు, 50 వేల మంది రైతులు పాల్గొన్నారు.