HCU | హెచ్‌సీయూలో వీధి కుక్కల స్వైరవిహారం.. రెండు జింకలు మృతి
HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వీధి కుక్కలు స్వైరవిహారం కొనసాగుతూనే ఉంది. ఈ వీధి కుక్కల దాడిలో రెండు జింకలు మృతి చెందాయి. ఈ ఘటన శనివారం సాయంత్రం వెలుగు చూసింది.
HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వీధి కుక్కలు స్వైరవిహారం కొనసాగుతూనే ఉంది. ఈ వీధి కుక్కల దాడిలో రెండు జింకలు మృతి చెందాయి. ఈ ఘటన శనివారం సాయంత్రం వెలుగు చూసింది. గతేడాది కంచ గచ్చిబౌలి అడవుల్లో చెట్లను తొలగించిన తర్వాత.. అక్కడున్న జింకలతో పాటు ఇతర జంతువులకు రక్షణ లేకుండా పోయింది.
ఈ ఘటనపై సేవ్ హెచ్‌సీయూకు సంబంధించిన ఓ విద్యార్థి మాట్లాడుతూ.. శనివారం సాయంత్రం క్యాంపస్‌లో వాకింగ్ చేస్తుండగా.. తెగిపడిన జింక కాళ్ల చూశాం. అదే సమయంలో జింకను కుక్కలు వెంబడిస్తున్న శబ్దాలు వినిపించాయి. కుక్కల దాడి నుంచి తప్పించుకునేందుకు జింక కూడా పరుగెత్తుతూ అరుస్తోంది. తాము అక్కడికి చేరుకునే సరికి కుక్కలు జింకను చంపి తినడం ప్రారంభించాయి. కుక్కలు రెండు జింకలను ఎంహెచ్- కే హాస్టల్ సమీపంలో చంపేశాయని విద్యార్థి పేర్కొన్నాడు.
జింకలను వీధి కుక్కల నుంచి కాపాడేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వన్యప్రాణి కార్యకర్తలు, సేవ్ హెచ్‌సీయూ విద్యార్థులు యూనివర్సిటీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింకలపై కుక్కలు దాడి చేయడం ఇదే తొలిసారి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కంచ గచ్చిబౌలి అడవుల్లోని చెట్లను తొలగించిన తర్వాత జింకలకు, ఇతర జంతువులకు ఆవాసం లేకుండా పోయింది. గతేడాది నుంచి కుక్కలు జింకలపై దాడులు చేస్తూ చంపేస్తూనే ఉన్నాయి. ఈ కంచ గచ్చిబౌలి ఫారెస్టులో 700కు పైగా పుష్పించే మొక్కలు, 10 జాతులకు చెందిన జంతువులు, 15 రకాల సరీసృపాలు, 230 జాతులకు చెందిన పక్షులు ఉన్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram