By-Elections | ఉప ఎన్నికల ఫలితాల్లో ఆప్‌, బీజేడీ విజయం

By-Elections | విధాత: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు పంజాబ్‌, యూపీ, ఒడిషా రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల (By-Elections) ఫలితాలు కూడా వెలువడ్డాయి. పంజాబ్‌లోని జలంధర్‌ ఎంపీ ఉప ఎన్నికలో అధికార ఆప్‌ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి సుశీల్‌ కుమార్‌ రింకూ గెలుపొందారు. కాంగ్రెస్‌ ఎంపీ సంతోష్‌ సింగ్‌ మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఒడిషా రాష్ట్రంలోని జార్సుగూడ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేడీ విజయకేతనం ఎగురవేసింది. బీజేడీ అభ్యర్థి దీపాలీదాస్‌ […]

  • Publish Date - May 13, 2023 / 11:01 AM IST

By-Elections |

విధాత: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు పంజాబ్‌, యూపీ, ఒడిషా రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల (By-Elections) ఫలితాలు కూడా వెలువడ్డాయి. పంజాబ్‌లోని జలంధర్‌ ఎంపీ ఉప ఎన్నికలో అధికార ఆప్‌ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి సుశీల్‌ కుమార్‌ రింకూ గెలుపొందారు. కాంగ్రెస్‌ ఎంపీ సంతోష్‌ సింగ్‌ మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది.

ఒడిషా రాష్ట్రంలోని జార్సుగూడ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేడీ విజయకేతనం ఎగురవేసింది. బీజేడీ అభ్యర్థి దీపాలీదాస్‌ గెలిచారు. బిజు జనతా దళ్‌ తన సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నది. యూపీలోని సువార్‌, ఛబే నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ అప్నాదళ్ (సోనేలాల్‌) విజయం సాధించింది. సువార్‌లో అహ్మద్‌ అన్సారీ, ఛబీలో రింకిలాల్‌ గెలుపొందారు.