కుక్కల బెడద నివారణకు చర్యలు: మున్సిపల్‌ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌

<p>విధాత‌: కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ అన్నారు. మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మున్సిపల్‌ శాఖ కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, జోనల్‌ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్వింద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లలోని వ్యర్థాలు, చికెన్‌, మటన్‌ వ్యర్థాలు వీధుల్లో వేయకుండా చూడాలన్నారు. విద్యార్థులకు కరపత్రాలు, హోర్డింగ్స్‌ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పెంపుడు జంతువుల […]</p>

విధాత‌: కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ అన్నారు. మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మున్సిపల్‌ శాఖ కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, జోనల్‌ కమిషనర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అర్వింద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లలోని వ్యర్థాలు, చికెన్‌, మటన్‌ వ్యర్థాలు వీధుల్లో వేయకుండా చూడాలన్నారు. విద్యార్థులకు కరపత్రాలు, హోర్డింగ్స్‌ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

పెంపుడు జంతువుల నమోదు పై యాప్‌ సిద్ధం చేయాలని, మై జీహెచ్‌ఎంసీ ద్వారా ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు కోసం 040-21111111 నంబర్‌ను సంప్రదించాలన్నారు.