Adipurush Adipurush | భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఆదిపురుష్’ సినిమాకు మొదటి వారం ఉన్నంత క్రేజ్ తర్వాత చాలా వరకూ తగ్గింది. ఇక ఈ సినిమా విషయంలో జరిగినంత ప్రచారం, తర్వాత సోషల్ మీడియాలో రేగిన దుమారం మామూలు మాటల్లో చెప్పలేం. ఓ రకంగా మొదటిసారి రామాయణాన్ని తీయడం చేతకాలేదని, మీరు తీసింది అసలు రామాయణమే కాదనేంత వరకూ ప్రేక్షకులు కామెంట్స్ చేశారంటే అది ఈ ఒక్క ఆదిపురుష్ చిత్రానికి మాత్రమే చెల్లింది. ఇప్పటికీ తెలుగు, […]
Adipurush
Adipurush | భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఆదిపురుష్’ సినిమాకు మొదటి వారం ఉన్నంత క్రేజ్ తర్వాత చాలా వరకూ తగ్గింది. ఇక ఈ సినిమా విషయంలో జరిగినంత ప్రచారం, తర్వాత సోషల్ మీడియాలో రేగిన దుమారం మామూలు మాటల్లో చెప్పలేం. ఓ రకంగా మొదటిసారి రామాయణాన్ని తీయడం చేతకాలేదని, మీరు తీసింది అసలు రామాయణమే కాదనేంత వరకూ ప్రేక్షకులు కామెంట్స్ చేశారంటే అది ఈ ఒక్క ఆదిపురుష్ చిత్రానికి మాత్రమే చెల్లింది.
ఇప్పటికీ తెలుగు, హిందీ ఇంకా ఇతర భాషల్లో ఎన్ని రామాయణాలు వచ్చినా కూడా అవి చాలా వరకూ ప్రజాదరణ పొందాయి. ఇక మన తెలుగు సినీ రంగంలో వెలువడిన రామాయణ ఇతిహాసం మీద చిత్రాలనైతే ఇప్పటికీ ప్రేక్షకులు పవిత్రంగా భావిస్తారు.
అందులో పాత్రలు చేసిన రాముడిగా ఎన్టీఆర్, సీత పాత్ర చేసిన అంజలీ దేవిని సీతారాములుగా ఇప్పటికీ అభిమానించే వారు లేకపోలేదు. ఎన్నిసార్లు చూసినా, ఎన్ని భాషల్లో చూస్తూన్నా రామాయణం ఎప్పుడూ ప్రజల మన్ననలు పొందుతూనే ఉంది.
అలాంటి గొప్ప ఇతిహాస కథను తెరకెక్కించి.. కథలో, కథనంలో చేసిన తప్పిదాలతో భారీగా ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ సినిమా దర్శకుడు ఓం రౌత్ పై, మాటల రచయితపై సోషల్ మీడియా సాక్షిగా అంతా ఓ రేంజ్లో ఎక్కేశారు. కొన్ని చోట్ల సినిమాను బ్యాన్ చేయాలనే నిరసనలు కూడా ఎదురయ్యాయి.
ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటి మూడు రోజులు కనిపించిన 340 కోట్ల కలెక్షన్స్ ఆ తరవాత పడిపోయాయి. మొదటి కలెక్షన్స్ గురించి ఉత్సాహంగా చెప్పిన చిత్ర యూనిట్ తర్వాత కలెక్షన్స్ పడిపోవడంతో ఎక్కడా సౌండ్ చేయలేదు. బాలీవుడ్లో అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయిందనేది ప్రజెంట్ టాక్.
అయితే పెట్టిన పెట్టుబడి రాకపోవడం, ఒక్కసారిగా అందుకున్న కలెక్షన్స్ పడిపోవడంతో.. బాలీవుడ్లో ‘పఠాన్’ సినిమా ప్రొమోట్ చేయడానికి ఆ చిత్ర యూనిట్ పడిన తంటాలే వీళ్ళూ పడాలని నిర్ణయించు కున్నట్టు తెలుస్తుంది. టికెట్స్ రేట్లు తగ్గించడం, వారానికి ఒక ఆఫర్ పెట్టి జనాలను థియేటర్లకు రప్పించాలనేది టీమ్ ఆలోచనగా తెలుస్తోంది.
ఇప్పటికే 3D స్క్రీనింగ్స్‌కి రూ. 150 పెట్టి.. అదికూడా వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు టికెట్ రేటును రూ. 112 రూపాయలకే 3D సినిమాను చూడవచ్చంటూ చిత్రయూనిట్ హడావుడి చేస్తోంది. అయినా కూడా నో యూజ్. ఇదిలానే కొనసాగితే.. టికెట్స్ ధరలను ఇంకా తగ్గించే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అంతే భారీగా యూనిట్‌కు నష్టాలను మిగల్చడం అయితే ఖాయంగా తెలుస్తోంది.