Aditi Rao Hydari | సినిమాల్లో రాణించాలంటే కాస్త అన్నింటికీ సిద్ధ పడి పోవాల్సిందే.. లేదంటే కెరియర్లో అణిచివేతకు గురవుతారు. అయితే గత కొన్నేళ్ళుగా వినిపిస్తున్న కాస్టింగ్ కౌచ్ అనేమాట అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్, కోలీవుడ్ అనేటటువంటి తేడాలే లేకుండా అన్ని పరిశ్రమలనూ ఈ సమస్య పట్టి పీడిస్తుంది. కొందరు కెరియర్లో నిలదొక్కుకోవడానికి ఈ కాస్టింగ్ కౌచ్‌కి తలవంచితే.. కొందరు మాత్రం కెరీర్లో రాణించక పోయినా పరవాలేదు గానీ విలువల్ని వదులుకోమనే వారికి మాత్రం అడుగడుగునా […]
Aditi Rao Hydari |
సినిమాల్లో రాణించాలంటే కాస్త అన్నింటికీ సిద్ధ పడి పోవాల్సిందే.. లేదంటే కెరియర్లో అణిచివేతకు గురవుతారు. అయితే గత కొన్నేళ్ళుగా వినిపిస్తున్న కాస్టింగ్ కౌచ్ అనేమాట అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్, కోలీవుడ్ అనేటటువంటి తేడాలే లేకుండా అన్ని పరిశ్రమలనూ ఈ సమస్య పట్టి పీడిస్తుంది. కొందరు కెరియర్లో నిలదొక్కుకోవడానికి ఈ కాస్టింగ్ కౌచ్‌కి తలవంచితే.. కొందరు మాత్రం కెరీర్లో రాణించక పోయినా పరవాలేదు గానీ విలువల్ని వదులుకోమనే వారికి మాత్రం అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి.
అయితే మీటూ అంటూ ఓ ఉద్యమాన్ని ప్రారంభించి నటీనటులు బయటకు వచ్చి, తమకు జరిగిన అన్యాయాలను ధైర్యంగా చెబుతున్నాను. కొందరు అప్పుడూ ఇప్పుడూ కూడా వాళ్ళ పనేదో వాళ్ళు సైలెంట్‌గా చేసుకుపోతున్నారు. అది వేరే విషయం అనుకోండి. తాజాగా ఈ విషయంపై హైదరాబాదీ అదితిరావు హైదరీ స్పందించింది. తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది.
ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ మీద వేసిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఈ విషయంలో ఎవరినీ అనడానికి ఏం లేదు. ఎవరినో దీనికి కారణమని వేలెత్తి చూపడం వల్ల కూడా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కాస్టింగ్ కౌచ్ అని పేరు పెట్టి అనేసినంత మాత్రన ఒరిగేదీ ఏం ఉండదు. ఇదంతా కూడా అమ్మాయిల బలహీనత మీద ఆధారపడి ఉంది. వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటే సరిపోతుంది. ఇలాంటి వాటికి లొంగిపోకుండా స్ట్రాంగ్‌గా నిలబడితే చాలు.. అని తన అభిప్రాయాన్ని చెప్పింది అదితి.
నిజం కూడా అదే.. కెరియర్ పిచ్చిలో పడి కాస్టింగ్ కౌచ్‌కి అంగీకరించి, ఆ తర్వాత ఎప్పుడో దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు మీడియా ముందు హడావుడి చేయడం అనే సందర్భాలు ఈ మాత్రం కోకొల్లలు. వాటికి లొంగిపోయిన వాళ్ళు మళ్ళీ ఉద్యమాన్ని లేవనెత్తడం ఎందుకు. ఇలాంటివన్నీ ముందు మనం పాటించి తర్వాత మిగతావారికి చెబితే బావుంటుంది.
ఇక అదితి రావు ప్రస్తుతం బాయ్స్ ఫేం సిద్ధార్థ్ తో డేటింగ్లో ఉంది. అలాగే సినిమాల్లో కూడా కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమాల్లో మాంచి బిజీగా ఉంది. అయితే అదితిరావు హైదరీపై కూడా ఆ మధ్య, ఈ మధ్య ఓ రేంజ్లో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అలాంటి హైదరీ ఇలా సజెషన్స్ ఇవ్వడం ఏం బాలేదంటూ.. కొందరు ఆమె వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తుండటం విశేషం.