మద్యం సేవించాక.. అలవోకగా ఇంగ్లీష్ మాట్లాడుతున్న మందుబాబులు..!
Alcohol Facts | మద్యం సేవించాక మందుబాబులు చిత్రవిచిత్రంగా మాట్లాడేస్తుంటారు. కొంత మంది తమ మనసులో మాట చెబితే.. మరికొందరు కుటుంబ రహస్యాలతో పాటు సంసార రహస్యాలను కూడా బయట పెడుతుంటారు. ఇంకొందరైతే ఏం మాట్లాడుతారో వారికే తెలియదు. ఇది పక్కన పెడితే చాలా మంది మందుబాబులు.. మద్యం సేవించిన తర్వాత తమ మాతృభాషను వదిలేసి.. ఇతర భాషలను గడగడ మాట్లాడేస్తారు. కొందరైతే ఇంగ్లీష్ భాషను అలవోకగా మాట్లాడేస్తారు. ఇక వారి భాష ఇతరులకు నవ్వు కూడా […]
Alcohol Facts | మద్యం సేవించాక మందుబాబులు చిత్రవిచిత్రంగా మాట్లాడేస్తుంటారు. కొంత మంది తమ మనసులో మాట చెబితే.. మరికొందరు కుటుంబ రహస్యాలతో పాటు సంసార రహస్యాలను కూడా బయట పెడుతుంటారు. ఇంకొందరైతే ఏం మాట్లాడుతారో వారికే తెలియదు.
ఇది పక్కన పెడితే చాలా మంది మందుబాబులు.. మద్యం సేవించిన తర్వాత తమ మాతృభాషను వదిలేసి.. ఇతర భాషలను గడగడ మాట్లాడేస్తారు. కొందరైతే ఇంగ్లీష్ భాషను అలవోకగా మాట్లాడేస్తారు. ఇక వారి భాష ఇతరులకు నవ్వు కూడా తెప్పిస్తుంది. అయితే అసలు తాగుబోతులు.. మద్యం సేవించిన తర్వాత ఇతర భాషలను ఎందుకు మాట్లాడుతారనే అంశంపై పరిశోధనలు జరిగాయి. మత్తున్న ఉన్న స్థితిలోనే భయపడకుండా, ఇతర భాషలను అలవోకగా మాట్లాడుతారని పలు అధ్యయనాల్లో తేలింది.
మందుబాబుల భాషపై ఓ పరిశోధనలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్, మాస్ట్రిక్ట్ యూనివర్సిటీ, లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు మందుబాబుల భాషపై అధ్యయనం చేపట్టారు. ఈ వివరాలను సైకో ఫార్మకాలజీ జర్నల్‌లో ప్రచురించారు. పీకల దాకా మద్యం సేవించిన అనంతరం రెండో భాష మాట్లాడే సామర్థ్యం మెరుగవుతుందని పరిశోధనలో వెల్లడైంది.
ఈ పరిశోధనలో భాగంగా రెండు భాషలపై అవగాహన ఉన్న ఓ 50 మందిని భాగస్వాములను చేశారు. వీరికి మద్యం ఇచ్చారు. ఆ తర్వాత మద్యం సేవించిన వ్యక్తి ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగాడు. కానీ అతనికి మద్యం సేవించే కంటే ముందు ఇంగ్లీష్ భాష రాదు. ఆల్కహాల్ అతిగా తీసుకున్నవారు మాట్లాడలేకపోయినట్లు గుర్తించారు. ఈ అంశంపై శాస్త్రవేత్తల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయని, తుది ఫలితం త్వరలోనే వెల్లడి కానుందని జర్నల్‌లో పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram