Allu Arjun | 19న నాగార్జున సాగర్‌కు అల్లు అర్జున్
Allu Arjun విధాత: సినీ స్టార్ అల్లు అర్జున్ ఈ నెల 19న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయన మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బీఆరెస్ తరుపునా టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తు ప్రజల్లో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. 2014ఎన్నికల్లో ఇబ్రహీమ్ పట్నం బీఆరెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయినా చంద్రశేఖర్ అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల తన సొంత నియోజవర్గం సాగర్‌పై […]
Allu Arjun
విధాత: సినీ స్టార్ అల్లు అర్జున్ ఈ నెల 19న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయన మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బీఆరెస్ తరుపునా టికెట్ ఆశిస్తున్నారు.
ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తు ప్రజల్లో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. 2014ఎన్నికల్లో ఇబ్రహీమ్ పట్నం బీఆరెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయినా చంద్రశేఖర్ అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఇటీవల తన సొంత నియోజవర్గం సాగర్‌పై దృష్టిపెట్టిన ఆయన నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలతో కొంతకాలంగా ఉనికి చాటుతున్నారు. ఈ నేపధ్యంలో తన మామా రాజకీయ అవసరాల కోణంలో అల్లు అర్జున్ నాగార్జున సాగర్‌లో పర్యటిస్తారని సమాచారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram