బాబోయ్.. బికినీలో ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న అమలాపాల్‌..!

  • Publish Date - October 7, 2023 / 01:48 PM IST

బోల్డ్ బ్యూటీ అమ‌లాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్రేమ ఖైదీ అనే సినిమాతో పరిచయం కాగా ,ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఆ త‌ర్వాత సిద్దార్థ్ హీరోగా నటించిన లవ్ ఫెయిల్యూర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో అమ‌లాపాల్‌కి ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అల‌రిస్తుంది ఈ భామ. దాదాపు కుర్రహీరోలందరితో కలిసి సినిమాలు చేసిన ఈ అందాల చిన్న‌ది అడ‌పాద‌డ‌పా పెద్ద హీరోల‌తో క‌లిసి కూడా ర‌చ్చ చేసింది.అమ‌లాపాల్ కేవ‌లం కమర్షియల్ సినిమాలే కాక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది.

అమ‌లాపాల్‌కి పాత్ర న‌చ్చితే ఎంత‌టి రిస్క్ అయిన చేస్తుంది. బోల్డ్‌గా క‌నిపించేందుకు కూడా ఏ మాత్రం ఆలోచించ‌దు. ఆమె అనే చిత్రంలో న్యూడ్‌గా క‌నిపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది అమ‌లాపాల్‌. చిత్రంలో ఆమె న‌ట‌న ప్ర‌తి ఒక్క‌రిని థ్రిల్ చేసింది. అంతే కాకుండా ఆమె తీసుకున్న నిర్ణ‌యం కూడా అంద‌రికి షాకిచ్చింది. అమ‌లాపాల్ చేసిన చిత్రాల‌లో ధనుష్ తో కలిసి చేసిన రఘువరన్ బీటెక్, వీఐపీ 2 సినిమాలు సూప‌ర్ హిట్ విజ‌యాల‌ని అందుకుంది. ఆమె ప‌ర్స‌న‌ల్ లైఫ్ కాస్త డిస్ట్ర‌బ్ కావ‌డంతో ఇక త‌న దృష్టి పూర్తిగా సినిమాల‌పైనే పెట్టింది. ఇప్పుడు కాస్త సినిమాలను తగ్గించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టవ్ గా ఉంటూ బోల్డ్ ఫొటో షూట్స్‌తో బెంబేలెత్తిస్తుంది. ఈ అమ్మ‌డి అరాచ‌కం చూసి అంద‌రు షాక్ అవుతున్నారు.

అమ‌లాపాల్‌కి ప్ర‌కృతి అంటే చాలా ఇష్టం. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా ప్ర‌కృతి ఒడిలో వాలిపోతుంది. ఈ మ‌ధ్య సినిమా అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో ఇలా ప్ర‌కృతి ఒడిలో సెద తీరుతుంది. గ్రామాలు, అడ‌వుల‌లోవిహ‌రిస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంది. తాజ‌గా బికినీలో ఈ అమ్మ‌డు సృష్టించిన అందాల విధ్వంసం కుర్రాళ్లకి మ‌త్తెక్కిస్తుంది. కేక పెట్టించే లుక్స్ కునుకు లేకుండా చేస్తున్నాయి. అమ‌లాపాల్ గ్లామ‌ర్ షో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గానే కనిపిస్తుంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం ఓ మ‌ల‌యాళ సినిమాతో బిజీగా ఉంద‌ని స‌మాచారం.

Latest News