Ticket Collector | రైలులో కరెంట్ కట్.. టీసీనీ టాయిలెట్‌లో బంధించిన ప్రయాణికులు
సుహైల్‌దేవ్ ఎక్స్‌ప్రెస్.. రెండు బోగీల్లో కరెంట్ కట్ ఆగ్రహంతో టికెట్ కలెక్టర్‌ను.. టాయిలెట్‌లో బంధించిన ప్రయాణికులు Ticket Collector | విధాత: వాహనాల్లో ప్రయాణిస్తుండగా ఉక్కపొస్తే కిటికీలు తీస్తాం. బయటి నుంచి వచ్చేచల్లటి గాలిని ఆస్వాదిస్తాం. కానీ, రైలు ఏసీ బోగీల్లో కరెంట్ పోతే చిమ్మచీకటి అలుముకుంటే, ఏసీ పనిచేయకపోతే, నిలువెల్లా చెమటలతో తడిసిపోతాం. ఆగ్రహంతో ఊగిపోతాం. సరిగ్గా ఇలాగే జరిగింది ఓ రైలులో. అయితే ఇక్కడ ప్రయాణికులు ఆగ్రహంతో టికెట్ కలెక్టర్‌ను టాయిలెట్‌లో బంధించారు. అసలు […]

- సుహైల్‌దేవ్ ఎక్స్‌ప్రెస్.. రెండు బోగీల్లో కరెంట్ కట్
- ఆగ్రహంతో టికెట్ కలెక్టర్‌ను.. టాయిలెట్‌లో బంధించిన ప్రయాణికులు
Ticket Collector | విధాత: వాహనాల్లో ప్రయాణిస్తుండగా ఉక్కపొస్తే కిటికీలు తీస్తాం. బయటి నుంచి వచ్చేచల్లటి గాలిని ఆస్వాదిస్తాం. కానీ, రైలు ఏసీ బోగీల్లో కరెంట్ పోతే చిమ్మచీకటి అలుముకుంటే, ఏసీ పనిచేయకపోతే, నిలువెల్లా చెమటలతో తడిసిపోతాం. ఆగ్రహంతో ఊగిపోతాం. సరిగ్గా ఇలాగే జరిగింది ఓ రైలులో.
అయితే ఇక్కడ ప్రయాణికులు ఆగ్రహంతో టికెట్ కలెక్టర్‌ను టాయిలెట్‌లో బంధించారు. అసలు ఏం జరిగిందంటే.. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి ఘాజీపూర్‌కు శుక్రవారం సుహైల్‌దేవ్ సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్ బయలు దేరింది. బయలుదేరిన కాసేపటికే బీ1, బీ2 బోగీల్లో విద్యుత్తు సమస్య తలెత్తింది.
బోగీల్లో చిమ్మచీకటి ఆవహించింది. ఏసీ బంద్ అయింది. విషయాన్నిట్రెయిన్ టికెట్ ఎగ్జామినర్ (TTE) దృష్టికి తీసుకెళ్లారు. కానీ, అయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రయాణికులు టీటీఈని టాయిలెట్‌లో బంధించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను ప్రయాణికులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. రైలు తుండ్ల స్టేషన్‌కు చేరుకోగా, ఆర్‌పీఎస్, రైల్వే అధికారులు బోగిల్లోకి వెళ్లి ప్రయాణికులను సముదాయించి టీటీఈని విడిపించారు. రైల్వే ఇంజినీర్లు కూడా విద్యుత్తు సమస్యను గుర్తించి పునరుద్ధరించారు. దాంతో కొంత ఆలస్యంగా తిరిగి రైలు బయలుదేరింది.