AP Politics ప్రభుత్వ మద్దతుతో వలంటీర్ల ధర్నాలు తన మాట మీదనే ఉన్న పవన్ ఆంధ్రాలో ఏమి నడుస్తోందిరా తమ్మీ… ఏమి లేదన్నా .. దేశంలో ఫాగ్ నడుస్తుందేమోకానీ ఆంధ్రలో మాత్రం పవన్ కళ్యాణ్.. వలంటీర్ల మధ్య వార్ నడుస్తోంది. ..వాలంటీర్లు సంఘవ్రిద్రోహులు.. రాష్ట్రంల మహిళలను అదృశ్యం చేస్తున్న ముఠా ఈ వాలంటీర్లు.. వేళ్ళ నడుం విరగ్గొడతాను అని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనిమీద పలువురు రాజకీయ… సినిమా ప్రముఖులు […]
AP Politics
ఆంధ్రాలో ఏమి నడుస్తోందిరా తమ్మీ… ఏమి లేదన్నా .. దేశంలో ఫాగ్ నడుస్తుందేమోకానీ ఆంధ్రలో మాత్రం పవన్ కళ్యాణ్.. వలంటీర్ల మధ్య వార్ నడుస్తోంది. ..వాలంటీర్లు సంఘవ్రిద్రోహులు.. రాష్ట్రంల మహిళలను అదృశ్యం చేస్తున్న ముఠా ఈ వాలంటీర్లు.. వేళ్ళ నడుం విరగ్గొడతాను అని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనిమీద పలువురు రాజకీయ… సినిమా ప్రముఖులు గట్టిగా పవన్ కు సమాధానం ఇవ్వడమేకేకుండా ఇటు వాలంటీర్లు మాత్రం తమ ఆందోళన కొనసాగిస్తున్నారు.
వాస్తవానికి తెలిసి అన్నారో, తెలీక అన్నారో.. ఏదో సంచలనం కోసం అన్నారో కానీ పవన్ కళ్యాణ్ అనవసరంగా ఒక రాంగ్ స్విచ్ నొక్కినట్లు గోదావరి జిల్లాలో సైతం వాయిస్ వినిపిస్తోంది.. ఇంటింటికి తిరిగి సర్వీస్ అందించే ఐదువేల జీతగాళ్ళు వలంటీర్ల మీద పవన్ చేసిన ఆరోపణలు ఆయన్ను రెండున్నర లక్షల మంది వాలంటీర్లతో బాటు వారి కుటుంబాలను పవన్ కు దూరం చేసినట్లు అయిందని అంటున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికర్స్ అంటూ చేసిన కామెంట్స్ మీద గోదావరి జిల్లాల్లోని కాపులు సైతం గుర్రుమంటున్నారు.
వాలంటీర్లతో కాపులు.. అందులోనూ మహిళా వాలంటీర్లు సైతం ఈ వ్యాఖ్యలను గర్హిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని తనకు కేంద్ర నిఘావర్గాలు చెప్పాయి అని అంటున్న పవన్ మరి పోలీసులులకు.. కోర్టుకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటివారు ప్రశ్నిస్తున్నారు. అయినా పవన్ తన మాట మీదనే నిలబడ్డారు.. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాల్సిందే అని అంటున్నారు .. గతంలో వాలంటీర్లను కూలీలుగా వ్యాఖ్యానించిన చంద్రబాబు సైతం తము వస్తే ఈ వ్యవస్థను కొనసాగిస్తాం అని అన్నారు.
మరి పవన్ కానీ టిడిపి సారధ్యంలో వచ్చే ప్రభుత్వంలో చేరితే అప్పుడు ఈ వాలంటీర్లను ఆపేస్తారా? అసలు ఈయనకు ప్రభుత్వంలో భాగం ఉంటుందా ? పొత్తు ఉంటుందా? ఇలాంటి పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు పవన్ వ్యాఖ్యలు అపరిపక్వతకు ప్రతిరూపం అని అంటున్నారు, అతి పెద్దది అయిన ఈ వ్యవస్థతో తగాదా పెట్టుకోవడం ద్వారా పవన్ కు ఏమి లాభం అని ? అది ఆయనకు నష్టమే అని అంటున్నారు. ఇదిలా ఉండగా వాలంటీర్లకు సంబంధిచిన వార్తలను సాక్షి పత్రిక భారీగా కవరేజి చేస్తుండగా… అటు తెలుగుదేశం అనుకూల మీడియా మాత్రం.. వాలంటీర్లలోని లోపాలు ఎత్తి చూపుతూ వారు ఏమైనా అక్రమాలకూ పాల్పడితే అలాంటి ఉదంతాలు ప్రాధాన్యం ఇస్తూ వార్తలు రాస్తోంది.