ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క (శిరీష) రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
విధాత : ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క (శిరీష) రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వ్యూహం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో.. ఊరు పేరు లేని ఆవిడ బర్రెలక్కగా చాలా ఫేమస్ అయిందని, బర్రెలను కాసే ఓ అమ్మాయి అంత పాపులర్ అయిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు కాలేకపోతున్నాడని వర్మ కామెంట్స్ చేశారు. వర్మ కామెంట్స్ తనను అవమానపరిచేలా ఉన్నాయని బర్రెలక్క తన లాయర్ రాజేశ్ కుమార్ ద్వారా మహిళా కమిషన్కు పిర్యాదు చేశారు.
రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కోన్నారు. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా ఈరోజు విడుదల కావాల్సి ఉంది. అయితే, సినిమాను ఈరోజు విడుదల చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది