Bhola Shankar విధాత: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన రెండ్రోజుల్లోనే చిరంజీవికి వైఎస్ జగన్ పవర్ ఏమిటో తెలిసొచ్చింది. రూల్స్ ప్రకారం పోవాల్సిందే అని తేల్చి చెప్పింది. దీంతో టికెట్ ధరలు పెంచుకుందామని భవించిన భోళా శంకర్ కు జెల్ల తగిలింది. ఆ సినిమా నిర్మాణానికి సంబంధించిన ఖర్చులు.. ఇతర బిల్స్ సరిగా సమర్పించనందున టికెట్ ధరలు పెంచే అవకాశం లేదని ప్రభుత్వం తేల్చిన చెప్పింది. టికెట్ల ధరలను పెంచాలంటే ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన 11 రకాల […]
Bhola Shankar
విధాత: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన రెండ్రోజుల్లోనే చిరంజీవికి వైఎస్ జగన్ పవర్ ఏమిటో తెలిసొచ్చింది. రూల్స్ ప్రకారం పోవాల్సిందే అని తేల్చి చెప్పింది. దీంతో టికెట్ ధరలు పెంచుకుందామని భవించిన భోళా శంకర్ కు జెల్ల తగిలింది. ఆ సినిమా నిర్మాణానికి సంబంధించిన ఖర్చులు.. ఇతర బిల్స్ సరిగా సమర్పించనందున టికెట్ ధరలు పెంచే అవకాశం లేదని ప్రభుత్వం తేల్చిన చెప్పింది.
టికెట్ల ధరలను పెంచాలంటే ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన 11 రకాల ఆధారాలు, పత్రాలు ప్రభుత్వానికి చూపించాలి. అవి చూపని పక్షంలో ధరలు పెంచేందుకు ప్రభుత్వ నిబంధనలు అంగీకరించవు. ఈ సినిమాకు సైతం ఆ సినిమా నిర్మాతలు ఆ పత్రాలు ప్రభుత్వానికి ఇవ్వలేదని అందుకే టికెట్ ధరలు పెంచడానికి నిబంధనలు ఒప్పుకోవడం లేదంటున్నారు. 101 కోట్లతో సినిమాను నిర్మించినట్టు నిర్మాతలు పేర్కొన్నారు కానీ అందుకు అవసరమైన పత్రాలను నిర్మాతలు ఇవ్వాల్సి ఉంటుందని ఏపీ సూచించింది.
సినిమా నియంత్రణ చట్టం ప్రకారం ఏపీలో 20 శాతం షూటింగ్ చేసినట్లు నిర్మాతలు ఆధారాలు సమర్పించలేదని ఏపీ తెలిపింది. అంతేకాకుండా డైరెక్టర్, హీరో, హీరోయిన్ల పారితోషికం కాకుండా సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టిన్నట్లు నిరూపించే పత్రాలను దరఖాస్తుతో జత చేయనందున అనుమతి నిరాకరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేసింది.
అన్ని వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నట్లయితే టికెట్ ధరలు పెంచుకొనే విషయం పరిశీలిస్తామని తెలియజేసింది. గతంలో చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు టికెట్ ధరల పెంచుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పించిందనే విషయాన్ని ఏపీ గుర్తుచేసింది. అప్పుడు ఆ సినిమాకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్లను ఏపీ ప్రభుత్వానికి నిర్మాతలు అందించారని పేర్కొంది.
ఇప్పుడు భోళా శంకర్ నిర్మాతలు ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించలేదు. కాబట్టే టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు లేనట్లు ఏపీ తెలిపింది. దీంతో పాపం చిరంజీవి సినిమాలు టికెట్స్ పెంచడం కష్టం అని తేలిపోయింది. అంతేకాకుండా జగన్ మీద మాట తూలితే పరిస్థితి ఎలా ఉంటుందో చిరంజీవికి ఒక చిన్న శాంపిల్ చూపినట్లు తెలుస్తోంది.