Site icon vidhaatha

భూమా అఖిల ప్రియ అరెస్ట్.. నంద్యాలలో ఉద్రిక్తత

విధాత, నంద్యాల : ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నంద్యాలలో మాజీ మంత్రి అఖిలప్రియ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శనివారం తెల్లవారుజామున అఖిల, తమ్ముడు విఖ్యాత్‌, భర్త భార్గవ్‌రామ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతరం ఆళ్లగడ్డలోని వారి ఇంటికి తరలించారు. అయితే అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అఖిలప్రియ తమను ఇంట్లో కూర్చోబెట్టినంత మాత్రాన దీక్షను ఆపేది లేదన్నారు. నా తమ్ముడికి ఏదైనా జరిగితే అందుకు నంద్యాల ఎస్పీ, డీఎస్పీలే బాధ్యత వహించాలని సంచలన వాఖ్యలు చేశారు.

Exit mobile version