Site icon vidhaatha

ys jagan: జగన్ జైలుకే.. బీజేపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

ys jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లబోతున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో లిక్కర్ స్కాం అంశం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు అరెస్ట్ అయ్యారు.

జగన్ మోహన్ రెడ్డి హయాంలో కీలకంగా పనిచేసిన జగన్ ఓఎస్టీగా పనిచేసిన ధనుంజయరెడ్డి, సీఎంవో కార్యదర్శి కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు జగన్ కు సంబంధించిన భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప కూడా అరెస్ట్ అయ్యారు.

దీంతో లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అంతిమ లబ్ధిదారుగా ఉన్న జగన్ అరెస్ట్ అవ్వబోతున్నారన్న వార్తలు తెరమీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ అరెస్ట్ కాక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.

వైసీపీ కనుమరుగు
త్వరలో ఏపీలో వైసీపీ కనిపించకుండా పోతుందని ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని దివాళా తీయించారని .. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. లిక్కర్ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా జైలు కెళతారని జోస్యం చెప్పారు. కూటమి ప్రభుత్వంపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Exit mobile version