తృణ‌మూల్ నాయ‌కుడి ఇంటిపై బాంబు దాడి.. ముగ్గురు మృతి

West Bengal | ప‌శ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్ మేధినిపూర్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. తృణ‌మూల్ కాంగ్రెస్ లీడ‌ర్ నాయ‌కుడి ఇంటిపై గుర్తు తెలియ‌ని దుండ‌గులు బాంబు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. వివ‌రాల్లోకి వెళ్తే.. భూప‌తిన‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని న‌ర్యాబిలా గ్రామానికి టీఎంసీ బూత్ ప్రెసిడెంట్ ఇంటిపై శుక్ర‌వారం రాత్రి 11:15 గంట‌ల స‌మ‌యంలో బాంబు దాడి చేశారు. దీంతో ఇంటి పైక‌ప్పు పూర్తిగా ధ్వంస‌మైంది. కిటికీలు, ఇత‌ర […]

తృణ‌మూల్ నాయ‌కుడి ఇంటిపై బాంబు దాడి.. ముగ్గురు మృతి

West Bengal | ప‌శ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్ మేధినిపూర్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. తృణ‌మూల్ కాంగ్రెస్ లీడ‌ర్ నాయ‌కుడి ఇంటిపై గుర్తు తెలియ‌ని దుండ‌గులు బాంబు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. భూప‌తిన‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని న‌ర్యాబిలా గ్రామానికి టీఎంసీ బూత్ ప్రెసిడెంట్ ఇంటిపై శుక్ర‌వారం రాత్రి 11:15 గంట‌ల స‌మ‌యంలో బాంబు దాడి చేశారు. దీంతో ఇంటి పైక‌ప్పు పూర్తిగా ధ్వంస‌మైంది. కిటికీలు, ఇత‌ర వ‌స్తువులు ప‌గిలిపోయాయి. ఓ ముగ్గురు వ్య‌క్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

అయితే బాంబు దాడికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాంబు దాడి ఘ‌ట‌న‌పై బీజేపీ కార్య‌క‌ర్త‌లు స్పందించారు. తృణ‌మూల్ కాంగ్రెస్ నాయ‌కులు.. త‌మ నివాసాల్లో నాటు బాంబులు త‌యారు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స్థాయి విచార‌ణ జ‌రపాల‌ని బీజేపీ కార్య‌క‌ర్త‌లు డిమాండ్ చేస్తున్నారు.