Vistara flight | ఢిల్లీ పూణె విమానానికి బాంబు బెదిరింపు
Vistara flight | విధాత : రాజధాని ఢిల్లీ నుంచి పూణెకు వెళ్లాల్సిన విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. విమానంలో బాంబు ఉన్నట్లుగా ఫోన్‌లో సమాచారం అందడంతో అప్రమత్తమైన అధికారులు విమానం నుంచి ప్రయాణికులను దించివేసి తనిఖీలు చేపట్టారు. రన్‌వేకు దూరంగా విమానాన్ని తరలించి తనిఖీలు చేపట్టారు. ఇవాళ ఉదయం 11గంటల సమయంలో తమకు ఆగంతకుల నుంచి కాల్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. సాయంత్రం వరకు కూడా తనిఖీలు కొనసాగాయి. విమానంలో ఉన్న వంద […]

Vistara flight | విధాత : రాజధాని ఢిల్లీ నుంచి పూణెకు వెళ్లాల్సిన విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. విమానంలో బాంబు ఉన్నట్లుగా ఫోన్‌లో సమాచారం అందడంతో అప్రమత్తమైన అధికారులు విమానం నుంచి ప్రయాణికులను దించివేసి తనిఖీలు చేపట్టారు. రన్‌వేకు దూరంగా విమానాన్ని తరలించి తనిఖీలు చేపట్టారు.
ఇవాళ ఉదయం 11గంటల సమయంలో తమకు ఆగంతకుల నుంచి కాల్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. సాయంత్రం వరకు కూడా తనిఖీలు కొనసాగాయి. విమానంలో ఉన్న వంద మంది ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని, క్లియరెన్స్ వచ్చాకా విమానం బయలుదేరుతుందన్నారు