KTR | ఒకే కారులో తెలంగాణ భవన్‌కు బావ, బామ్మర్ది.. వీడియో
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌కు పార్టీ నాయకులు భారీగా చేరుకుంటున్నారు
హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌కు పార్టీ నాయకులు భారీగా చేరుకుంటున్నారు. అయితే ఈ సమావేశానికి బావ హరీశ్‌రావు, బామ్మర్ది కేటీఆర్ కలిసి ఒకే కారులో వచ్చారు. భవన్ వద్ద కారు ఆగగానే మొదట కేటీఆర్ దిగారు. ఆ తర్వాత హరీశ్‌రావు దిగారు. అనంతరం హరీశ్‌రావు వద్దకు కేటీఆర్ వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి ఘనస్వాగతం పలికారు.
ఒకే కారులో తెలంగాణ భవన్‌కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు. pic.twitter.com/bEupKlnEqp
— Telugu Scribe (@TeluguScribe) April 18, 2024
అయితే వీరు ప్రయాణించిన కారు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి వచ్చిందా..? లేక మరో ప్రాంతం నుంచి వచ్చిందా..? అనేది తెలియరాలేదు. హరీశ్‌రావు, కేటీఆర్ ప్రయాణించిన కారులోనే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఉన్నారు. బావబామ్మర్దులు వెనుక సీట్లో కూర్చోగా, కౌశిక్ రెడ్డి ముందు సీట్లో కూర్చున్నారు. బావబామ్మర్దులు కలిసి ఒకే కారులో తెలంగాణ భవన్‌కు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram