BuddhaVanam | అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో ఆకట్టుకున్న బుద్ధవనం
BuddhaVanam టి.ఎస్.టీడిసీ, చైర్మన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య విధాత: లడక్‌లో మహాబోధి ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ నిర్వహించిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం, నాగార్జునసాగర్ లో నిర్మించిన ప్రపంచస్థాయి బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్- బుద్ధవనంపై ప్రదర్శించిన డాక్యుమెంటరీ, ప్రపంచ బౌద్ధ సంస్థలు, గురువులు, ప్రముఖులను ఆకట్టుకుందని, తెలంగాణ పర్యాటక శాఖ వృద్ధి సంస్థ, చైర్మన్, గెల్లు శ్రీనివాస యాదవ్ బుద్ధవనం ప్రత్యేక అధికారి మలేపల్లి లక్ష్మయ్య ఒక […]
BuddhaVanam
- టి.ఎస్.టీడిసీ, చైర్మన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య
విధాత: లడక్‌లో మహాబోధి ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ నిర్వహించిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం, నాగార్జునసాగర్ లో నిర్మించిన ప్రపంచస్థాయి బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్- బుద్ధవనంపై ప్రదర్శించిన డాక్యుమెంటరీ, ప్రపంచ బౌద్ధ సంస్థలు, గురువులు, ప్రముఖులను ఆకట్టుకుందని, తెలంగాణ పర్యాటక శాఖ వృద్ధి సంస్థ, చైర్మన్, గెల్లు శ్రీనివాస యాదవ్ బుద్ధవనం ప్రత్యేక అధికారి మలేపల్లి లక్ష్మయ్య ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

మహాబోధి ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్, లే – లడక్, స్థాపక అధ్యక్షులు, భిక్ష సంఘసేన ఆహ్వానంపై తాము గెల్లు, మల్లెపల్లి ప్రారంభ సదస్సులో ముఖ్య, విశిష్ట అతిధులుగా పాల్గొని తెలంగాణాలో బౌద్ధ పర్యాటక వనరులు, బుద్ధవనం ప్రత్యేకతలపై ప్రసంగించారు.
బుద్ధవనంపై సదస్సు నిర్వాహకుల నుంచి, అంతర్జాతీయ ప్రతినిధుల నుంచి అనూహ్య స్పందన లభించిందని, త్వరలో పలువురు బౌద్ద ప్రముఖులు బుద్ధవనాన్ని సందర్శిస్తామన్నారని మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. ప్రారంభ సదస్సులో ఇరువురినీ సదస్సు నిర్వహకులు సత్కరించి , జ్ఞాపకలను బహూకరించినట్లుగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహాబోధి సొసైటీ, చైర్మన్ కస్సప భంతే , ఇండియన్ యూనివర్సిటీస్, ప్రెసిడెంట్, డా. ప్రియ రంజన్ త్రివేది, బుద్ధవనం అధికారులు సుధన్ రెడ్డి, డి.ఆర్ .శ్యాంసుందర్రావు తెలంగాణకు చెందిన బౌద్ధ అభిమానులు కేకే రాజా, ఏకలవ్య, రమేష్ పాల్గొన్నట్లు అని లక్ష్మయ్య తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram