Site icon vidhaatha

ఆ కుక్క‌ను రూ. 20 కోట్ల‌కు అమ్మిన హైద‌రాబాదీ.. ప్ర‌త్యేక‌త‌లు ఏంటంటే..?

Cadabom Hayder | పెంపుడు కుక్క‌లను పెంచుకోవ‌డం స‌హ‌జ‌మే. అయితే ఇత‌ర దేశాల‌కు చెందిన కుక్క‌ల‌ను పెంచుకునేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. అందుకోసం కోట్ల రూపాయాలు ఖ‌ర్చు చేసి ఆ కుక్క‌ల‌ను కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్‌లోకి వ‌చ్చే ప్ర‌తి బ్రీడ్‌ను కొనేందుకు ఆస‌క్తి చూపుతుంటారు.

ఈ క్ర‌మంలోనే బెంగ‌ళూరుకు చెందిన క‌డ‌బామ్స్ కెన్నెల్స్ ఓన‌ర్, ఇండియన్ డాగ్ బ్రీడ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు స‌తీశ్‌.. హైద‌రాబాదీ నుంచి ఖ‌రీదైన కుక్క‌ను కొనుగోలు చేశాడు. కాకాసియ‌న్ షెపెర్డ్ జాతికి చెందిన కుక్క‌ను రూ. 20 కోట్ల‌కు కొనుగోలు చేసి వార్త‌ల్లో నిలిచాడు స‌తీశ్‌. ఇక ఈ శున‌కానికి క‌డ‌బామ్ హెడ‌ర్ అని పేరు పెట్టాడు. క‌డ‌బామ్ హేడ‌ర్.. త్రివేండ్రమ్ కెన్నెల్ క్లబ్ ఈవెంట్, క్రౌన్ క్లాసిక్ డాగ్ షోలో పాల్గొంది. బెస్ట్ డాగ్ బ్రీడ్ కింద 32కి పైగా మెడల్స్ గెలుచుకుంది.

హేడ‌ర్ ప్ర‌స్తుతం ఏసీ వాతావ‌ర‌ణంలో పెరుగుతుంద‌ని స‌తీశ్ తెలిపాడు. ఈ శున‌కాన్ని ఫిబ్ర‌వ‌రి నెల‌లో ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేస్తాన‌ని చెప్పుకొచ్చాడు. క‌డ‌బామ్స్ కెన్నెల్స్ ఓన‌ర్ ఇప్ప‌టికే కొరియా దోస మస్తిఫ్స్‌ని రూ.1 కోటి పెట్టి కొన్నారు. అలాగే అలస్కాన్ మాలామ్యూట్‌ని రూ.8 కోట్లకు, టిబెటన్ మస్తిఫ్‌ని రూ.10 కోట్లకు కొన్నారు.

క‌డ‌బామ్ హేడ‌ర్ ప్ర‌త్యేక‌తలు ఇవే..

హేడ‌ర్ ప్ర‌స్తుత వ‌య‌సు 1.5 సంవ‌త్స‌రాలు. జీవిత‌కాలం 10 నుంచి 12 సంవ‌త్స‌రాలు. షెపెర్డ్‌కు ధైర్యం, న‌మ్మ‌కం ఎక్కువ‌. దేనికీ భ‌య‌ప‌డ‌దు. అత్యంత తెలివైన కుక్క‌. ఈ శున‌కం చాలా పెద్ద సైజులో పెరుగుతాయి. ఈ కుక్క‌ల‌ను ఆస్తుల ర‌క్ష‌ణ కోసం ఉప‌యోగిస్తున్నారు. దొంగలతో పాటూ.. తోడేళ్లు, కోయోట్స్ వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తున్నాయి. హేడ‌ర్ 45 నుంచి 70 కిలోల వ‌ర‌కు బ‌రువు పెరుగుతుంది.

Exit mobile version