రూపాయికి సవాలే!
వడ్డీ రేట్ల పెరుగుదల కొనసాగే అవకాశం ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2022-23లో 7% లోక్‌సభలో ఆర్థిక సర్వేను సమర్పించిన నిర్మల ECONOMIC SURVEY 2023 RUPEE COVID విధాత: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. అనంతరం లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. దేశ […]
- వడ్డీ రేట్ల పెరుగుదల కొనసాగే అవకాశం
- ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2022-23లో 7%
- లోక్‌సభలో ఆర్థిక సర్వేను సమర్పించిన నిర్మల
ECONOMIC SURVEY 2023 RUPEE COVID
విధాత: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. అనంతరం లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2022-23 లో 7 శాతంగా నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2023-24లో అది 6.5 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది.
ఆర్థికసర్వేలోని ముఖ్యమైన అంశాలు ఇవే
- కొవిడ్ మహమ్మారి కాలంలో స్తంభించిన భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు పూర్తి కోలుకున్నది. నిలిచిపోయిన కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయి. నెమ్మదించిన అంశాలన్నీ తిరిగి పుంజుకున్నాయి.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతం వద్ద ద్రవ్యోల్బణం వ్యక్తిగత వినిమయాన్ని తగ్గించే అధిక స్థాయిలో లేదా పెట్టుబడులను బలహీనపరిచేంత తక్కువస్థాయిలో గాని ఉండదు.
- రుణరేట్లు దీర్ఘకాలం అధికంగా ఉండే అవకాశం ఉన్నది. కఠిన ద్రవ్య పరపతి విధాన వైఖరిని మరికొంతకాలం పొడిగించడానికి స్థిరంగా కొనసాగుతున్నద్రవ్యోల్బణం దోహదం చేయనున్నది.
- అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇంకా వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉన్నందున రూపాయి మారక విలువకు సవాళ్లు ఎదురుకావొచ్చు.
- ఎగుమతుల వృద్ధి నెమ్మదించడం, కరెంటు ఖాతా లోటు విస్తృతమవుతున్న నేపథ్యంలో రూపాయికి ఒడిదొడుకులు తప్పకపోవచ్చు
- ప్రపంచవ్యాప్తంగా కమొడిటి ధరలు అధికస్థాయిలో కొనసాగుతున్నందున కరెంటు ఖాతా లోటు మరింత పెరిగే అవకాశం ఉన్నది.
- ఇతర దేశాలతో పోలిస్తే భారత్ కొవిడ్ సంక్షోభం నుంచి భారత్ వేగంగా కోలుకున్నది. దేశీయ గిరాకీ. మూలధన పెట్టుబడుల్లో పెరుగుదల భారత వృద్ధికి దోహదం చేయనున్నాయి.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఎగుమతుల వృద్ధి కొంచెం నెమ్మదించింది.
- ప్రపంచ ఆర్థిక వృద్ధి, వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదించడం ఎగుమతులపై ప్రభావం చూపాయి.
- స్థిరాస్థి రంగంతో పాటు నిర్మాణ కార్యకలాపాలు పుంజుకోవడంతో ఉపాధి కల్పన మెరుగైంది. వలస కూలీలు తిరిగి పట్టణాలకు చేరడానికి ఇది దోహదపడుతుంది.
- 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సాధారణ స్థాయిలో ఉండి, రుణ వ్యయం తక్కువగా ఉన్నట్లయితే సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)ల రుణాల వృద్ధి మెరుగ్గా ఉండే అవకాశం ఉన్నది.
- కొవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్) వల్ల ఎంఎస్‌ఎంఈలు వేగంగా కోలుకుంటున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram