Chandramukhi 2 | కొన్ని పాత్రల్లో కొందరు నటులు మాత్రమే నప్పుతారు. వాళ్ళను తప్ప మరొకరిని ఆ పాత్రలో ఊహించను కూడా ఊహించలేం. అంతగా నటించి జీవిస్తారు. 18 ఏళ్ళనాడు విడుదలైన చంద్రముఖి అనగానే జ్యోతిక మాత్రమే మన కళ్ళముందుకు వస్తుంది. ఆమె చేసిన పాత్రకు అంతగా మంచి మార్కులు కూడా పడ్డాయి. అయితే జ్యోతిక స్థానంలో మరెవరినీ ఇప్పటికీ ఊహించుకోలేం. ఈ పాత్రను గతంలో చాలామంది పలు భాషల్లో చేసినా కూడా జ్యోతిక నప్పినట్టుగా మరొకరు […]
Chandramukhi 2 |
కొన్ని పాత్రల్లో కొందరు నటులు మాత్రమే నప్పుతారు. వాళ్ళను తప్ప మరొకరిని ఆ పాత్రలో ఊహించను కూడా ఊహించలేం. అంతగా నటించి జీవిస్తారు. 18 ఏళ్ళనాడు విడుదలైన చంద్రముఖి అనగానే జ్యోతిక మాత్రమే మన కళ్ళముందుకు వస్తుంది. ఆమె చేసిన పాత్రకు అంతగా మంచి మార్కులు కూడా పడ్డాయి. అయితే జ్యోతిక స్థానంలో మరెవరినీ ఇప్పటికీ ఊహించుకోలేం. ఈ పాత్రను గతంలో చాలామంది పలు భాషల్లో చేసినా కూడా జ్యోతిక నప్పినట్టుగా మరొకరు నప్పలేదు.
అయితే చంద్రముఖి సినిమాకు సీక్వెల్ అంటూ గతంలో వెంకటేష్‌తో పి. వాసు దర్శకత్వంలో ‘నాగవల్లి’ అనే సినిమా వచ్చింది. ఇందులో వెంకటేష్‌తో పాటు అనుష్క, రిచా గంగోపాధ్యాయ, కమలినీ ముఖర్జీ, శ్రద్దాదాస్ హీరోయిన్స్‌గా కనిపించినా.. ‘నాగవల్లి’ మూవీ ‘చంద్రముఖి’ సినిమా అంత హిట్ కాలేకపోయింది. ఇక ఈ సినిమాలో ‘చంద్రముఖి’ పాత్రలో అనుష్క నటించిగా, ‘చంద్రముఖి’ ఆవహించిన పాత్రలో రిచా గంగోపాధ్యాయ నటించింది.
ఎవరు ఎంతగా పాత్రల్లో లీనమై నటించినా కూడా జ్యోతిక నటనకు దగ్గర కాలేకపోయారు. ఓ రకంగా చెప్పాలంటే ‘చంద్రముఖి’లో జ్యోతిక నటన ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ నటన కూడా పేలవంగా తేలిపోయింది. అంతలా పి.వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక 18 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయనే చంద్రముఖి మూవీకి సీక్వెల్ ‘చంద్రముఖి 2’ అని ప్రకటించారు.
మరి ఇందులో చంద్రముఖిగా కంగనా రనౌత్ నటిస్తోంది.. అయితే ఈ పాత్ర అంత సులువైనది కాదు. 18 ఏళ్ళ నాడు జ్యోతిక ‘చంద్రముఖి’ పాత్రతో వేసిన ముద్రను చెరిపేసి మరీ ప్రేక్షకుల హృదయాల్లోకి చొచ్చుకుపోవాలంటే కంగనా సత్తా సరిపోతుందా? ఆమధ్య ‘చంద్రముఖి 2’కి సంబంధించి విడుదల చేసిన పోస్టర్లో కంగనా గెటప్ పరవాలేదనిపించినా, ఆమె నటన గురించి ఇంకా ఏం తెలీలేదు.
అయితే గతంలో కన్నడ, మలయాళంలో చంద్రముఖి పాత్రలలో శోభన, సౌందర్య, విద్యాబాలన్ వంటి పెద్ద హీరోయిన్స్ కనిపించి మెప్పించేందుకు ప్రయత్నించారు. అయితే వాళ్ళను మించేలా జ్యోతిక నటించింది. ఇప్పుడు కంగనకు ఈ పాత్ర పెద్ద పరీక్షనే పెట్టనుంది. చూద్దాం. ఎంతవరకూ చంద్రముఖి పాత్రకు న్యాయం చేయనుందో మరి. ఇంకో మెయిన్ ఛేంజ్ కూడా ఈ ‘చంద్రముఖి 2’ ఉంది.
ఇందులో రజనీ పాత్రలో రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ముఖ్యపాత్రల్లో వడివేలు, రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, శ్రుతి డాంగే, సుభిక్ష కృష్ణన్, రవి మారియా, కార్తీక్ శ్రీనివాసన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 15న వినాయక చవితికి విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. కంగనా ఏ మేరకు మెప్పిస్తుందో తెలియాలంటే.. ఆ డేట్ వరకు ఆగక తప్పదు.