అంతరిక్షంలోకి కోతులు.. అక్కడ పునరత్పత్తి సాధ్యమేనా..?
Tiangong space station | అంతరిక్షంలో సంభోగం సాధ్యమేనా..? గతంలో ఎలుకలతో కానిది.. ఇప్పుడు కోతులతో అవుతుందా? పునరుత్పత్తి ప్రక్రియ సాధ్యమవుతుందా? గురుత్వాకర్షణ లేని చోట అవి ఎలా ప్రవర్తిస్తాయో తెలుసుకోనేందుకు చైనా సిద్ధమైంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటికే దూసుకుపోతున్న డ్రాగన్.. తాను కొత్తగా ప్రారంభించిన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నది. సున్నా గురుత్వాకర్షణ వాతావరణంలో పునరుత్పత్తి, పెరుగుదల వంటి అంశాలను అధ్యయనం చేడానికి అంతరిక్షంలోకి కోతులను పంపేందుకు చైనా రెడీ అవుతోంది. […]

Tiangong space station | అంతరిక్షంలో సంభోగం సాధ్యమేనా..? గతంలో ఎలుకలతో కానిది.. ఇప్పుడు కోతులతో అవుతుందా? పునరుత్పత్తి ప్రక్రియ సాధ్యమవుతుందా? గురుత్వాకర్షణ లేని చోట అవి ఎలా ప్రవర్తిస్తాయో తెలుసుకోనేందుకు చైనా సిద్ధమైంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటికే దూసుకుపోతున్న డ్రాగన్.. తాను కొత్తగా ప్రారంభించిన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నది. సున్నా గురుత్వాకర్షణ వాతావరణంలో పునరుత్పత్తి, పెరుగుదల వంటి అంశాలను అధ్యయనం చేడానికి అంతరిక్షంలోకి కోతులను పంపేందుకు చైనా రెడీ అవుతోంది. ఆరు దశాబ్దాల నుంచి నిర్వహిస్తున్న అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటి వరకు ఏ దేశం చేయని పనిని చేసేందుకు చైనా పరిశోధకులు తహతహలాడుతున్నారు.
గతంలో సోవియట్ పరిశోధకులు ఎలుకలతో ఇలాంటి ప్రయోగం చేశారు. 18 రోజుల పాటు సంభోగ ప్రక్రియ కోసం ఎలుకలను అంతరిక్షంలోకి ంపాపరు. కానీ, అవి అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చాక కూడా గర్భం దాల్చలేదు. దీన్ని బట్టి గురుత్వాకర్షణ లేని స్థితిలో వృషణాలు, ఇతర పునరుత్పత్తి అవయవాలు దెబ్బతింటాయని పరిశోధకలు తేల్చారు. అంతేకాకుండా జంతువుల సెక్స్ హార్మోన్‌లో గణనీయమైన క్షీణతకు కారణమవుతుందని పరిశోధకులు గుర్తించారు. తక్కువ రక్తపోటు వల్ల అంగస్తంభన సమస్యలు కూడా ఏర్పడుతాయని నిర్ధారించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో.. ఈ గుట్టును చేధించేందుకు మానవులతో ఎక్కువ సారూప్యత గల కోతులను ప్రయోగించడమే సరైందని చైనా పరిశోధకులు భావిస్తున్నారు. చంద్రుడు, అంగారక గ్రహం చుట్టూ కక్ష్యలో దీర్ఘకాల స్థిర నివాసం కోసం మరిన్ని దేశాలు ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో ఈ ప్రయోగం ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే, కోతులను ఎన్‌క్లోజర్లలో ఎక్కువసేపు స్వేచ్ఛగా ఉంచడం కష్టసాధ్యమేనని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
పరిశోధన సమయంలో కోతులకు ఆహారం ఇవ్వడం, వాటి మలాన్ని పారేయడం వంటి సవాళ్లను సైంటిస్టులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. లైంగిక ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండేలా, వాటిని సౌకర్యవంతమైన పద్ధతిలో ఉంచాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. ప్రస్తుతం టియాంగాంగ్ అంతరిక్ష కేంద్ర ముగ్గురు వ్యోమగాములకు నిలయంగా ఉంది. విస్తృత ప్రయోగాల కోసం దీనిని మరింత విస్తరించాలని బీజింగ్ సైంటిస్టులు భావిస్తున్నారు.