Rakesh Master | కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత
Rakesh Master | ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ హఠాన్మరణం చెందారు. విశాఖపట్టణం నుంచి నిన్న హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ఆస్వస్తతకు గురవడంతో సమీప బంధువు ఆయనను గాంతీ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ రాకేశ్ మాస్టర్ కన్నుమూశారు. 1968లో తిరుపతిలో జన్మించిన ఆయనకు నలుగురు అక్కలు, అన్నా, తమ్ముడు ఉన్నారు. కేరిర్ ఆరంబంలో ముక్కురాజు మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకున్న ఆయన అనంతరం లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు వంటి […]

Rakesh Master |
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ హఠాన్మరణం చెందారు. విశాఖపట్టణం నుంచి నిన్న హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ఆస్వస్తతకు గురవడంతో సమీప బంధువు ఆయనను గాంతీ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ రాకేశ్ మాస్టర్ కన్నుమూశారు.
1968లో తిరుపతిలో జన్మించిన ఆయనకు నలుగురు అక్కలు, అన్నా, తమ్ముడు ఉన్నారు. కేరిర్ ఆరంబంలో ముక్కురాజు మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకున్న ఆయన అనంతరం లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు వంటి 500లకు పైగా చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు. ప్రస్తుతం సౌత్ ఇండియాను ఓ షేక్ చేస్తున్న శేఖర్ మాస్టర్. జానీ మస్టర్‌లు ఇయన శిష్యులే.
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కాంట్రవర్సీ ఇంటర్యూలు, హీరోలు, సినీ ఇండస్ట్రీలోని ఇతరులపై ఇష్టారీతిన మాట్లాడుతూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. యూట్యూబ్ వేదికగా రామ్ గోపాల్ వర్మ, శ్రీ రెడ్డి, ఎన్టీఆర్, బాలయ్య, మోహన్ బాబు, చిరంజీవి, మంచు లక్ష్మిలను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం లేపాయి.
ఈ క్రమంలో SRK ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభఙంచి సోషల్ మీడియాలో పేరు తెచ్చుకున్న వారిని ఇంటర్యూలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కన్నుమూయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా రాకేశ్ మాస్టర్ పార్థీవదేహాన్ని బోరబండకు తరలించారు.