Rakesh Master | రాకేశ్ మాస్టర్ భార్యని.. పబ్లిక్‌లో కొట్టడానికి కారణం అదేనంటున్నారు
Rakesh Master | విధాత: ప్రముఖ డాన్స్ మాస్టర్ రాకేశ్ ఇటీవల సడెన్‌గా మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన చనిపోయిన కొన్ని రోజులకు ఆయన మూడో భార్య లక్ష్మిపై కొందరు దాడి చేశారు. దీనికి సంబంధించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అసలు ఏమై ఉంటుందా అని అంతా అనుకుంటున్నారు. ఏ కారణం లేకుండా వారు దాడి చేయరనే నేపథ్యంలో.. ఈ దాడిపై కొంత వివరణ వచ్చింది. తనపై లల్లీ, నెల్లూరు భారతి, దుర్గ, పెరుగు పెద్దమ్మ అనే […]
Rakesh Master |
విధాత: ప్రముఖ డాన్స్ మాస్టర్ రాకేశ్ ఇటీవల సడెన్‌గా మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన చనిపోయిన కొన్ని రోజులకు ఆయన మూడో భార్య లక్ష్మిపై కొందరు దాడి చేశారు. దీనికి సంబంధించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అసలు ఏమై ఉంటుందా అని అంతా అనుకుంటున్నారు. ఏ కారణం లేకుండా వారు దాడి చేయరనే నేపథ్యంలో.. ఈ దాడిపై కొంత వివరణ వచ్చింది.
తనపై లల్లీ, నెల్లూరు భారతి, దుర్గ, పెరుగు పెద్దమ్మ అనే మహిళలు నడిరోడ్డుపై దాడి చేశారని, తనని ఇకపై యూట్యూబ్‌లో వీడియోలు చేయవద్దని, యూట్యూబ్ వదిలేయాలని బెదిరిస్తున్నారని రాకేశ్ మాస్టర్ మూడో భార్య లక్ష్మి తాజాగా ఓ ఛానల్‌కి చెప్పుకొచ్చింది. ఈ విషయంగానే విపరీతంగా కొట్టారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది లక్ష్మి.. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే దాడికి పాల్పడిన లల్లీ కూడా ఇదంతా యూట్యూబ్ ఛానల్ వల్లనే వచ్చిందని చెబుతుంది. ఇద్దరం కలిసి వీడియోలు చేసేవారమని, తనతో చేసిన వీడియోలకు డబ్బు చెల్లించేదాన్నని.. కానీ ఓ వీడియో విషయంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగిందని.. దానికి లక్ష్మి తనను తిట్టడమే కాకుండా తన కూతురిని కూడా తిడుతూ.. తప్పుగా మాట్లాడటం మొదలు పెట్టిందని చెప్పింది.
ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు కూడా పట్టించుకోలేదని ఆమె వెల్లడించింది. అందుకే కోపం ఆపుకోలేకే లక్ష్మి పై దాడికి పాల్పడ్డానని చెప్పింది. అయితే నిజంగా యూట్యూబ్ మాత్రమే వీరి మధ్య గొడవకి కారణం కాదనేలా కూడా వార్తలు వినబడుతున్నాయి.

యూట్యూబ్ వీడియోల కోసం అంతగా బ్యాచ్‌ని తీసుకొచ్చి కొట్టించాల్సిన అవసరం ఏముంటుంది. విషయం చెప్పడం లేదు కానీ.. ఏదో గట్టి కారణమే వీళ్లు దాస్తున్నారనేలా టాక్ వినబడుతోంది. ప్రస్తుతం ఈ విషయమై పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలోనే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది.
కాగా, ఈ మధ్యనే రాకేశ్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతూ, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన అంత్యక్రియలను శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, సత్య మాస్టర్ వంటి వారంతా దగ్గరుండి జరిపించారు. చివరి క్షణాల్లో రాకేశ్ మాస్టర్‌కు ఆయన శిష్యులు అండగా నిలబడ్డారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram