Medak: అంబేద్క‌ర్ మనుమడికి సుభాష్ రెడ్డిని పరిచయం చేసిన CM KCR

నాజీవితం ధన్యమైంద‌న్న సుభాష్ రెడ్డి విధాత, మెదక్ బ్యూరో: అంబేద్క‌ర్ మనమడిని స్వయంగా సీఎం కెసిఆర్ తనకు పరిచయం చేయడం, ఆయనను తాను కలుసుకోవడంతో తన జీవితం ధన్యం అయిందని ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి ఆనందం వ్య‌క్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో 125 అడుగుల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్క‌ర్ మనుమడు ప్రకాష్ అంబేద్క‌ర్ తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్బంగా సీఎం కేసీఆర్ […]

Medak: అంబేద్క‌ర్ మనుమడికి సుభాష్ రెడ్డిని పరిచయం చేసిన CM KCR
  • నాజీవితం ధన్యమైంద‌న్న సుభాష్ రెడ్డి

విధాత, మెదక్ బ్యూరో: అంబేద్క‌ర్ మనమడిని స్వయంగా సీఎం కెసిఆర్ తనకు పరిచయం చేయడం, ఆయనను తాను కలుసుకోవడంతో తన జీవితం ధన్యం అయిందని ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి ఆనందం వ్య‌క్తం చేశారు.

శుక్రవారం హైదరాబాద్ లో 125 అడుగుల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్క‌ర్ మనుమడు ప్రకాష్ అంబేద్క‌ర్ తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్బంగా సీఎం కేసీఆర్ మా తమ్ముడు అంటూ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిని అంబేద్క‌ర్ మనుమడు ప్రకాష్ అంబేద్క‌ర్ కు పరిచయం చేశారు.

ఈ మేరకు ఆయన సుభాష్ రెడ్డిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్క‌ర్ ను కలవడం తన అదృష్టంగా భావిస్తున్నానని సుభాష్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల తనకు ఈ అవకాశం లభించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.