సీఎం కేసీఆర్ చిరకాలం జీవించాలి: మంత్రి సత్యవతి
సమక్క సారలమ్మకు పూజలు ఆలయ పూజారుల సంప్రదాయ స్వాగతం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతలను సోమవారం తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఆలయ పూజారులు డోలు వాయిద్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అధికారులు శాలువతో మంత్రిని సన్మానించారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ సమర్పించి ముఖ్యమంత్రి కేసీఆర్, వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. […]
- సమక్క సారలమ్మకు పూజలు
- ఆలయ పూజారుల సంప్రదాయ స్వాగతం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతలను సోమవారం తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఆలయ పూజారులు డోలు వాయిద్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం అధికారులు శాలువతో మంత్రిని సన్మానించారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ సమర్పించి ముఖ్యమంత్రి కేసీఆర్, వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, సీఎం కేసీఆర్ పై నిరంతరం అమ్మవారి దీవెనలు ఉండాలని, వారు ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్, ఇతర అధికారులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram