Tiger Attack : అడవి మధ్యలో కారు ఆపాడు..పులికి చిక్కాడు

అడవి మార్గంలో కారు ఆపి కిందకు దిగిన వ్యక్తిపై పెద్దపులి మెరుపు దాడి చేసి ప్రాణాలు తీసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ భయంకర దృశ్యం పట్ల నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tiger Attack : అడవి మధ్యలో కారు ఆపాడు..పులికి చిక్కాడు

విధాత : అటవీ ప్రాంతాలలో..అభయారణ్యాలలో ప్రయాణం ఎంత ప్రాణాంతకమో అనేక ఘటనలు వెల్లడించాయి. అయినప్పటికి ప్రజలు అటవీ మార్గాల ప్రయాణంలో తగిన జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ అడవిలో డొంక దారిలో వెలుతున్న ఓ కారును ఆపి..కిందకు దిగిన వ్యక్తిపై పెద్దపులి దాడి చేసిన ఘటన వీడియో వైరల్ గా మారింది.

అడవిలోని మట్టిదారి గుండా వెలుతున్న కారును ఆపిన వ్యక్తి .అక్కడ ఎవరు లేరనుకుని మూత్ర విసర్జన కోసం కిందకు దిగాడు. అతడికి సమీపంలో ఉన్న పెద్దపులి ఇదే అదనుగా అతడిపై దాడి చేసింది. కారు దిగిన వ్యక్తి తిరిగి కారులోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికి పెద్దపులి బలం ముందు అతడు తలొగ్గక తప్పలేదు.

ముందుగా అతడి భుజాన్ని నోట కరుచుకున్న పెద్దపులి పెనుగులాటలో ఆ వ్యక్తి మెడను కూడా నోట పట్టుకుంది. దీంతో ఆ వ్యక్తి పులి నోటికి చిక్కి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు సౌతాఫ్రికా బోట్సవానా అభయారణ్యాలలో అధికంగా చోటుచేసుకోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

Bomb Threat : నాంపల్లి కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు
Smriti Mandhana| స్మతి మంధాన ఛార్మింగ్.. రైజింగ్