Vande Bharat Manufacturing Video | వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ ఎలా తయారు చేస్తారో తెలుసా! వైరల్ వీడియో చూసేయండి!

Vande Bharat Manufacturing Video | భారత్‌లోని అత్యాధునిక సెమీ హైస్పీడ్ రైళ్లు అయిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తయారు చేయడం ఎప్పుడైనా చూశారా? చెన్నైలోని భారీ ఫ్యాక్టరీలో వందే భారత్ రైళ్లు తయారవుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

Reported by: Chandram | ట్రెండింగ్ | Mar 11, 2026, 11:26 pm IST
Read Time: 6 mins
Vande Bharat Manufacturing Video | వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ ఎలా తయారు చేస్తారో తెలుసా! వైరల్ వీడియో చూసేయండి!

Vande Bharat Manufacturing Video | దేశంలో అత్యాధునిక సెమీ హైస్పీడ్ రైళ్లు అయిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు మంచి డిమాండ్ ఉంది. విమానాల్లో తరహాలో సేవలందిస్తూ తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుస్తుండటంతో ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలని చాలామంది కలలు కంటుంటారు. మరి భారత రైల్వే (Indian Railways)కు చెందిన ఈ హైటెక్ ట్రైన్ ఎలా తయారవుతుందో ఎప్పుడైనా చూశారా? చెన్నైలోని భారీ ఫ్యాక్టరీలో వందే భారత్ రైళ్లు తయారవుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

వందే భారత్ రైళ్లను ఎలా తయారు చేస్తారో క్లియర్‌గా చూపిస్తూ ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ కరణ్ కపూర్ ( @karannzzz అనే ) ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పెట్టారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు ఈ విధంగా తయారవుతున్నాయో చూపించారు. ఇది ఈ వీడియోపై నెటిజన్లలో భారీ ఆసక్తిని రేకెత్తించింది. దీంతో ఈ వీడియోకు సోషల్‌మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.

 


ఈ వీడియోలో కరణ్ కపూర్.. మీరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించి ఉంటారు. కానీ అవి ఎక్కడ తయారవుతాయో చూశారా? అంటూ ఫ్యాక్టరీలోకి తీసుకెళ్తాడు. అక్కడ భారీ వర్క్‌షాప్‌లో ట్రైన్ కోచ్‌లు తయారవుతున్న దృశ్యాలను చూపించారు. దాదాపు పూర్తయిన రైల్వే కోచ్‌లను వర్క్‌షాప్ లోపలి ట్రాక్‌లపై వచ్చి టెక్నికల్ పనులు చేస్తున్నట్లుగా ఇందులో కనిపిస్తుంది. కోచ్ కింద ఒక టెక్నీషియన్ కూర్చొని యంత్ర భాగాలను జాగ్రత్తగా అమరుస్తూ కనిపించాడు.

ఇక మరో కోచ్ లోపలి భాగాన్ని కూడా కరణ్ కపూర్ వీడియోలో చూపించారు. అక్కడ పూర్తిగా మెటల్ ఫ్రేమ్ మాత్రమే ఉంది. ఫ్లోరింగ్, సీటింగ్, ఇంటీరియర్ ప్యానెల్స్ ఇన్‌స్టాల్ చేయడానికి ముందు ప్రారంభ దశలో క్యారేజ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఫ్యాక్టరీలో తయారవుతున్న మరో కోచ్‌లో మెటల్ బీమ్‌లు, ఫ్లోర్ నిర్మాణం, ఇతర స్ట్రక్చరల్ భాగాలు కనిపిస్తాయి. ఇక వీడియో చివరలో ట్రైన్ ముందు భాగాన్ని చూపించారు. అక్కడ పలువురు కార్మికులు ట్రైన్ భాగాలను పరిశీలిస్తున్న పనిచేస్తున్నట్లు చూపించారు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన కరణ్ ఆసక్తికరమైన క్యాప్షన్ పెట్టారు. ” వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు తయారయ్యే చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించే అవకాశం లభించింది. మీరు ఎప్పుడైనా రైళ్లు, కార్లు, బైక్‌లు, విమానాలు తయారు చేసే ప్రదేశానికి వెళ్లారా” అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోను ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు ఈ ప్యాక్టరీలోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుందా అని ఒక యూజర్ ప్రశ్నించాడు. పర్మిషన్ తీసుకుంటే వెళ్లొచ్చా? అక్కడకు వెళ్లాక ట్రైన్ తయారీని ప్రత్యక్షంగా చూడవచ్చా అంటూ తమ సందేహాలను అడిగారు.

Read More :