Cheedikada BC Hostel | ఇన్ని సమస్యలా?..వైరల్ గా బీసీ హాస్టల్ బాలికల వీడియో!

ఏపీలోని అనకాపల్లి జిల్లా చీడికాడ బీసీ బాలికల వసతి గృహం విద్యార్థినిలకు ఉన్న సమస్యలు వింటే మాత్రం...వామ్మో సర్కార్ హాస్టల్స్ అనుకోక తప్పదు. ఇలాంటి సమస్యలు ఎవరికి రాకూడదని అనిపించకమానదు. హాస్టల్ లో తాము ఎదుర్కొంటున్న సమస్యలు..ఎదురవుతున్న ఇబ్బందులు..జరుగుతున్న అక్రమాలపై విద్యార్థినులు వీడియోలో ఏకరవు పెట్టిన తీరు..విన్నవారిలో ఆవేశం రగిలించ మానదు

Reported by: Y.V. Narsimha Reddy | ఆంధ్ర ప్రదేశ్ | Mar 13, 2026, 12:31 pm IST
Read Time: 4 mins
Cheedikada BC Hostel | ఇన్ని సమస్యలా?..వైరల్ గా బీసీ హాస్టల్ బాలికల వీడియో!

విధాత : ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్ లో అరకొర వసతులు, నాసిరకం ఆహారం వంటి సమస్యలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వాలు కోట్ల రూపాయలను విద్యార్థుల వసతుల కోసం ఖర్చు చేస్తుంటే..నిర్వాహకులు మాత్రం వాటిలో అధిక శాతం స్వాహా చేస్తూ విద్యార్థులకు అరకొర వసతులు, అర్థాకలి పాలు చేస్తున్నారన్న ఆరోపణలు సాధారణమైపోయాయి. అయితే ఏదేని హాస్టల్ లో కొన్ని సమస్యలు ఉంటే..మరికొన్ని వసతులైనా విద్యార్థులకు అందుతాయన్న నమ్మకం ఉంటుంది.

కాని ఏపీలోని అనకాపల్లి జిల్లా చీడికాడ బీసీ బాలికల వసతి గృహం విద్యార్థినిలకు ఉన్న సమస్యలు వింటే మాత్రం…వామ్మో సర్కార్ హాస్టల్స్ అనుకోక తప్పదు. ఇలాంటి సమస్యలు ఎవరికి రాకూడదని అనిపించకమానదు.

చీడికాడ బీసీ బాలికల వసతి గృహం విద్యార్థినిలు తాము హాస్టల్ లో ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి తేవడంతో …ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. హాస్టల్ సిబ్బంది మెనూ అమలు చేయడం లేదని, స్కూల్లో తిన్నారు కదా, హాస్టల్లో కూడా తింటారా ? అని తిడుతున్నారాని, ఫఉట్ సరిపోవడం లేదని ప్రశ్నించిన వారిపై అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని విద్యార్థినులు ఆ వీడియోలో ఆరోపించారు.

ఆదివారం ఇతర పనులు చెబుతున్నారని ఫిర్యాదు చేశారు. బాతురూమ్ లను మాతోనే కడిగిస్తున్నారని ఆరోపించారు. హాస్టల్ లో తాము ఎదుర్కొంటున్న సమస్యలు..ఎదురవుతున్న ఇబ్బందులు..జరుగుతున్న అక్రమాలపై విద్యార్థినులు వీడియోలో ఏకరవు పెట్టిన తీరు..విన్నవారిలో ఆవేశం రగిలించ మానదు. విద్యార్థినులపై తమ సమస్యలపై ఏకంగా ఏపీ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తూ ఈ వీడియో విడుదల చేయడం గమనార్హం.

 

ఇవి కూడా చదవండి :

Sunrisers Leeds X Account Suspended | సన్ రైజర్స్ ఫ్రాంచైజీ కావ్య పాపకు ఎక్స్ షాక్ !
Road Accident | నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. న‌లుగురు మృతి