• Telugu News
  • /Telangana

Road Accident | నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. న‌లుగురు మృతి

Road Accident | నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెంద‌గా, ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

Reported by: raj | తెలంగాణ‌ | Mar 13, 2026, 8:57 am IST
Read Time: 2 mins
Road Accident | నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. న‌లుగురు మృతి

Road Accident | నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెంద‌గా, ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క‌ చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బ‌స్సులో మొత్తం 22 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. డ్రైవ‌ర్ అతివేగం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తేలింది. హైద‌రాబాద్ నుంచి మ‌హారాష్ట్ర వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మృతుల కుటుంబాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.