CM KCR | రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్‌

CM KCR హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి హాజరు విధాత: ప్రగతి భవన్‌, రాజ్‌భవన్ మధ్య దూరాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారోత్సవం తొలగించబోతుంది. తెలంగాణ హైకోర్టు నూతన చీప్ జస్టిస్‌గా నియామితులైన అలోక్ ఆరథే ప్రమాణ స్వీకారోత్సవం రేపు రాజ్‌భవన్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ మేరకు సీఎం, సీఎస్ హాజరుకావాల్సివుంది. సీఎం కేసీఆర్ గవర్నర్‌కు ఇస్తున్న ప్రోటోకాల్ ప్రాధాన్యత వివాదం అటుంచితే చీఫ్ జస్టిస్ ప్రమాణాస్వీకారానికి మాత్రం సీఎం కేసీఆర్ ప్రోటోకాల్ […]

CM KCR | రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్‌

CM KCR

  • హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి హాజరు

విధాత: ప్రగతి భవన్‌, రాజ్‌భవన్ మధ్య దూరాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారోత్సవం తొలగించబోతుంది. తెలంగాణ హైకోర్టు నూతన చీప్ జస్టిస్‌గా నియామితులైన అలోక్ ఆరథే ప్రమాణ స్వీకారోత్సవం రేపు రాజ్‌భవన్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ మేరకు సీఎం, సీఎస్ హాజరుకావాల్సివుంది.

సీఎం కేసీఆర్ గవర్నర్‌కు ఇస్తున్న ప్రోటోకాల్ ప్రాధాన్యత వివాదం అటుంచితే చీఫ్ జస్టిస్ ప్రమాణాస్వీకారానికి మాత్రం సీఎం కేసీఆర్ ప్రోటోకాల్ మేరకు హాజరవ్వడం గమనార్హం.

గత ఏడాది రాజ్‌భవన్‌లో జరిగిన చీఫ్ జస్టిస్ ప్రమాణా స్వీకారానికి కూడా అప్పటి సీఎస్ సోమేష్‌కుమార్‌తో కేసీఆర్ హాజరయ్యారు. మరోసారి అదే కార్యక్రమం నిమిత్తం కేసీఆర్ రాజ్‌భవన్ గడప తొక్కనుండటం విశేషం.